Barabar Premistha : సినిమాల్లోనే కాదు.. ప్రమోషన్స్ లో కూడా స్టేజిపైనే హీరో హీరోయిన్ ముద్దులు..?

ఈ హీరో హీరోయిన్స్ చేసిన ప్రమోషన్ కాస్తా వైరల్ గా మారింది.(Barabar Premistha)

Barabar Premistha : సినిమాల్లోనే కాదు.. ప్రమోషన్స్ లో కూడా స్టేజిపైనే హీరో హీరోయిన్ ముద్దులు..?

Barabar Premistha

Updated On : January 26, 2026 / 9:33 PM IST

Barabar Premistha : ఇటీవల సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా జనాల్లోకి వెళ్లాలని మూవీ యూనిట్స్ చిత్ర విచిత్రాల ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో కొన్ని ఇబ్బందికరంగా ఉండే ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ హీరో హీరోయిన్స్ చేసిన ప్రమోషన్ కాస్తా వైరల్ గా మారింది.(Barabar Premistha)

సీనియర్ నటుడు ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ యాటిట్యూడ్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌, మేఘన ముఖర్జీ జంటగా ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ సినిమాతో ఫిబ్రవరి 6న రాబోతున్నారు. మూవీ యూనిట్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Also See : చంద్రబాబు భార్య, పవన్ భార్య ఒకే ఫ్రేమ్ లో.. నమస్కరించిన లోకేష్.. ఫొటోలు వైరల్..

అయితే తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో స్టేజిపైనే హీరో హీరోయిన్ ఆల్మోస్ట్ లిప్ కిస్ పెట్టుకున్నట్టు ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ లో హీరో హీరోయిన్ లిప్ కిస్ ఇచ్చుకోడానికి సిద్ధమవుతున్నట్టు ఉంటారు. సినిమాలో వీరి మధ్య లిప్ కిస్ సీన్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పోస్టర్ రీ క్రియేషన్ చేయాలన్నట్టు స్టేజిపైనే హీరో హీరోయిన్స్ మోకాళ్ళ మీద కూర్చొని మరీ లిప్ కిస్ ఇచ్చుకునేలా పోజులు ఇచ్చారు.

Barabar Premistha

దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మరీ ఇంతలా ప్రమోషన్ చేస్తారా? ఇంకొంచెం అయితే స్టేజిపై లిప్ కిస్ కూడా పెట్టేలా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Ranabaali : విజయ్, రష్మిక కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. బ్రిటిష్ వాళ్లపై పోరాడిన యోధుడు.. హాలీవుడ్ హీరో విలన్ గా..