Hyderabad : రూ.26 వేలకే కారు..! ఎగబడిన జనాలు.. తీరా అక్కడికి వెళ్తే.. అరెస్టు చేసిన పోలీసులు

Hyderabad : రూ.26 వేలకే కారు అందిస్తామని ప్రచారం చేశాడు. ఇది నమ్మిన ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే అది మోసం అని తేలింది.

Hyderabad : రూ.26 వేలకే కారు..! ఎగబడిన జనాలు.. తీరా అక్కడికి వెళ్తే.. అరెస్టు చేసిన పోలీసులు

Cars

Updated On : January 26, 2026 / 10:53 PM IST

Hyderabad : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నాం.. రూ. 26వేలకే కారు అంటూ ప్రచారం చేశారు.. 50కార్లను మాత్రమే తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు.. ఇంకేముంది.. సోమవారం తెల్లవారుజామునకల్లా పెద్దెత్తున స్థానికులు షాపు వద్ద క్యూకట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నిర్వాహకుడు చేతులెత్తేశాడు. మోసపూరిత ప్రకటన చేశారని గుర్తించిన ప్రజలు రెచ్చిపోయారు.. అక్కడున్న కార్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సదరు షాపు యాజమానిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Hyderabad : అయ్యో.. కూకట్‌పల్లిలో విషాద ఘటన.. నాన్నా.. నాన్నా అంటూ అరిచేటప్పటికి.. ప్రాణాలు తీసిన చైనా మాంజ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన ట్రస్ట్ కార్ యాజమాని రోషన్ రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26వేలకే కారు అమ్ముతానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. నా దగ్గర 50 కార్లు ఉన్నాయి.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నా.. అందుకే వీటిని రూ.26వేలకే విక్రయిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. తక్కువ ధరకే కారు వస్తుందని భారీ సంఖ్యలో ప్రజలు షోరూం వద్దకు చేరుకున్నారు. సోమవారం తెల్లవారు జామునే అక్కడ ప్రజలు క్యూకట్టారు.

భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రోషన్ చేతులెత్తేశాడు. నా వద్ద కార్లు లేవు.. నేను కార్లు అమ్మడం లేదంటూ చెప్పాడు. ఆగ్రహానికి లోనైన ప్రజలు కార్లను, కుర్చీలు, సౌండ్ బాక్సులను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి ప్రజలను శాంతింపజేశారు. తప్పుడు ప్రటన ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన రోషన్ పై కేసు నమోదు చేసి నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.