Liger Issue : విజయ్ దేవరకొండ వల్లే పూరికి ఈ పరిస్థితి.. బాలీవుడ్ లో కూడా ఇదే టాపిక్..

ఇంత జరుగుతున్నా సినిమా రిలీజ్ టైంలో ఓవర్ గా మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అస్సలు స్పందించకపోవడంతో పలువురు విజయ్ పై సీరియస్ అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమకి చెందిన వ్యక్తులు............

Liger Issue : విజయ్ దేవరకొండ వల్లే పూరికి ఈ పరిస్థితి.. బాలీవుడ్ లో కూడా ఇదే టాపిక్..

Cini persons fires on Vijay Devarakonda Regarding Liger Issue

Updated On : October 27, 2022 / 9:38 AM IST

Liger Issue :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ సినిమా మీద చాలా ఆశలు, అంచనాలు రేకెత్తించారు. విజయ్ దేవరకొండ తన మాటలతో, స్పీచ్ లతో, యాటిట్యూడ్ తో ఈ సినిమా భారీ హిట్ అవుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రమోట్ చేశాడు. పాన్ ఇండియా రేంజ్ లో బాలీవుడ్ లో కూడా వీర లెవల్లో ప్రమోట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లోనే విజయ్ మాట్లాడే విధానాన్ని పలువురు విమర్శించారు.

సినిమా రిలీజ్ అయ్యాక సినిమాలో విజయ్ మాట్లాడిన దాంట్లో కనీసం పది శాతం కూడా లేకపోవడంతో భారీ ఫ్లాప్ మూట కట్టుకుంది. సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ అలా ఓవర్ గా మాట్లాడకపోతే కనీసం యావరేజ్ గా అయినా నిలిచేది, విజయ్ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చాలా మంది విమర్శించారు. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ ఎక్కువగా మీడియా ముందుకు రావట్లేదు, వచ్చినా సైలెంట్ గానే ఉంటున్నాడు.

ప్రస్తుతం లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరడంతో తమ నష్టాన్ని భర్తీ చేయాలని పూరి జగన్నాధ్ చుట్టూ తిరగడం, అతని ఇంటివద్ద ధర్నా చేస్తానని బ్లాక మెయిల్ చేయడం, పూరి వార్నింగ్ ఇవ్వడం, పోలీస్ కేసు పెట్టడం.. ఇలా గత రెండు రోజులుగా పూరి జగన్నాధ్, లైగర్ సినిమా మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకి నిర్మాత కావడం, లైగర్ ని హిందీలో తీసి తెలుగులో డబ్ చేయడంతో ఇది పక్కా బాలీవుడ్ సినిమా అయింది. దీంతో లైగర్ మరోసారి బాలీవుడ్ లో కూడా చర్చగా మారింది.

ఇంత జరుగుతున్నా సినిమా రిలీజ్ టైంలో ఓవర్ గా మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అస్సలు స్పందించకపోవడంతో పలువురు విజయ్ పై సీరియస్ అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమకి చెందిన వ్యక్తులు.. లైగర్ సినిమా పరాజయంలో విజయ్ కి కూడా భాగం ఉంది. విజయ్ యాటిట్యూడ్, అతని ఓవర్ కాన్ఫిడెన్స్, మాటల వల్లే లైగర్ మరింత పరాజయం పొందింది. పూరి జగన్నాధ్ ని అలా వదిలేయడం కరెక్ట్ కాదు. విజయ్ కూడా ఇందుకు బాధ్యుడు, విజయ్ కూడా డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలి ఎంతో కొంత అని కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై అయినా విజయ్ స్పందిస్తాడేమో చూడాలి.

Puri Jagannadh : లైగర్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ పై పూరి జగన్నాధ్ పోలీస్ కేసు.. మరింత ముదురుతున్న వివాదం..

లైగర్ సినిమా సమయంలో విజయ్ పూరితో చాలా క్లోజ్ గా తిరిగి ఇప్పుడు అసలు మాట్లాడకపోవడంతో సినీ వర్గాలు ఒక్కొక్కరి ఒక్కోలా స్పందిస్తున్నారు. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.