Dasara Movie Collections: తొలిరోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దసరా.. ఓవర్సీస్లో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!
నాచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘దసరా’ ఎట్టకేలకు నిన్న(మార్చి 30న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్లో దసరా మూవీ దుమ్ములేపింది.

Dasara Movie Collections Career Best Openings For Nani In Overseas
Dasara Movie Collections: నాచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘దసరా’ ఎట్టకేలకు నిన్న(మార్చి 30న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా దసరా ముందునుండీ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా దద్దరిల్లిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.
నానిని ఇంత ఊరమాస్ అవతారంలో ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదని.. ఈ సినిమాలో యాక్షన్‌ను నెక్ట్స్ లెవెల్లో చూపెట్టారని సినిమా చూసిన ఆడియెన్స్ దసరా మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తొలిరోజు దసరా భారీ వసూళ్లపై కన్నేసినట్లుగా సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా, అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. అటు నానికి మంచి పట్టున్న ఓవర్సీస్లోనూ దసరా దుమ్ములేపింది. ప్రీమియర్లు, తొలిరోజు కలుపుకుని ఈ సినిమా ఏకంగా $850K పైగా వసూళ్లను రాబట్టినట్లుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.
Dasara Movie: ఓటీటీని లాక్ చేసుకున్న దసరా.. ఎందులో చూడొచ్చు అంటే..?
నాని కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని వారు పేర్కొన్నారు. ఈ లెక్కన శుక్రవారం నాడు దసరా సినిమా అలవోకగా 1 మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెడుతుందని వారు తెలిపారు. ఇక ఈ సినిమా శనివారం ఉదయం నాటికి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను కూడా క్రాస్ చేస్తుందని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ సినిమా ఇదే జోష్‌లో తన రన్ కొనసాగిస్తే, ఓవర్సీస్ మార్కెట్లో నాని తన సత్తాను మరింతగా పెంచుకోవడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.
Natural Star @NameIsNani’s #Dasara is growing strength to strength at the USA BoxOffice
$850K+ USA gross & counting
𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐎𝐩𝐞𝐧𝐢𝐧𝐠𝐬 𝐟𝐨𝐫 𝐍𝐚𝐧𝐢#DasarainUSA Release by @PrathyangiraUS@KeerthyOfficial @SLVCinemasOffl @VjaiVattikuti @PharsFilm pic.twitter.com/0mwuVd11Lw
— Prathyangira Cinemas (@PrathyangiraUS) March 31, 2023