Dimple Hayathi: రామబాణం నుండి భైరవి లుక్ ఔట్.. భలే ఉందిగా!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామబాణం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటవీల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Dimple Hayathi: రామబాణం నుండి భైరవి లుక్ ఔట్.. భలే ఉందిగా!

Dimple Hayathi As Bharaivi From Gopichand Ramabanam Movie

Dimple Hayathi: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామబాణం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటవీల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Dimple Hayathi : రాయల్ గా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద డింపుల్ హయతి

కాగా, ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. భైరవి అనే పాత్రలో అందాల భామ డింపుల్ హయతి నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఆమె పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో డింపుల్ హయతి, చాలా క్యూట్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Gopichand: అఫీషియల్.. గోపీచంద్ రామబాణం వదిలేది ఆ రోజునే!

ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిస్తుండగా జగపతి బాబు, ఖుష్బూలు ఈ సినిమాలో హీరో అన్న-వదిన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండగా, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.