Director Atlee: తన కొడుకు పేరును రివీల్ చేసిన డైరెక్టర్ అట్లీ

తమిళ దర్శకుడు అట్లీ భార్య ప్రియా మోహన్ ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేసినట్లుగా ఈ స్టార్ కపుల్ తెలిపారు.

Director Atlee: తన కొడుకు పేరును రివీల్ చేసిన డైరెక్టర్ అట్లీ

Director Atlee Announces His Son Name

Director Atlee: తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో ఇప్పుడు అందరి చూపులు ఈ డైరెక్టర్‌పై పడ్డాయి. షారుఖ్ కోసం అట్లీ ఎలాంటి కథను తీసుకొస్తున్నాడా.. జవాన్ మూవీతో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద అట్లీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Atlee: తండ్రైన స్టార్ డైరెక్టర్ అట్లీ.. మగబిడ్డ పుట్టాడంటూ పోస్ట్!

కాగా, ఈ క్రేజీ డైరెక్టర్ ఇటీవల తండ్రి అయ్యాడనే విషయం తెలిసిందే. తన భార్య ప్రియా మోహన్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా అట్లీ ఇటీవల తెలియజేశాడు. అయితే తాజాగా తన కుమారుడి పేరును రివీల్ చేశాడు ఈ డైరెక్టర్. తన భార్య ప్రియా మోహన్‌తో కలిసి తన కొడుకును ఆలయానికి తీసుకెళ్లి నామకరణం చేసినట్లుగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన కొడుకు పేరు ‘మీర్’గా నామకరణం చేసినట్లు అట్లీ అనౌన్స్ చేశాడు.

Atlee: తల్లిదండ్రులు కాబోతున్న తమిళ డైరెక్టర్ అట్లీ-ప్రియ దంపతులు

ఇక అట్లీ తన కొడుకు నామకరణం చేయడంతో సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా అట్లీకి విషెస్ చెబుతున్నారు. ఇక జవాన్ మూవీలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.