Kumar Vatti : టాలీవుడ్‌లో మరో విషాదం, కరోనాతో యువ డైరెక్టర్ మృతి

కరోనావైరస్ మహమ్మారి సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినీ ప్రముఖులను కరోనా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు కోవిడ్ తో చనిపోయారు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ ను మహమ్మారి బలితీసుకుంది.

Kumar Vatti : టాలీవుడ్‌లో మరో విషాదం, కరోనాతో యువ డైరెక్టర్ మృతి

Kumar Vatti

Director Kumar Vatti: కరోనావైరస్ మహమ్మారి సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినీ ప్రముఖులను కరోనా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు కోవిడ్ తో చనిపోయారు. తాజాగా
మరో యంగ్ డైరెక్టర్ ను మహమ్మారి బలితీసుకుంది.

కరోనాతో పోరాడి ఓడిన డైరెక్టర్ కుమార్ వట్టి తుది శ్వాస విడిచారు. శుక్రవారం(ఏప్రిల్ 30,201) సాయంత్రం ఆయన కన్నుమూశారురు. ఆయన వయసు 39 ఏళ్లు. కుమార్ వట్టి ‘మా అబ్బాయి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీతోనే కుమార్ వట్టి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.

Kumar Vatti

కుమార్ వట్టి తొలుత పరుశురాం దగ్గర యువత సినిమా కోసం అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత సోలో సినిమాకు కూడా పనిచేశారు. ఆ సందర్భంలోనే శ్రీ విష్ణుతో పరిచయం జరగడం, తాను దర్శకుడిగా మారితే తన హీరో కచ్చితంగా శ్రీ విష్ణు అని అప్పుడే ఫిక్స్ అయ్యారట కుమార్ వట్టి. అలా మొత్తానికి మా అబ్బాయి సినిమాతో కుమార్ వట్టి దర్శకుడిగా మారారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా 35 సినిమాలకు పనిచేశారు. ఇప్పటికే ఓ కథ రెడీ చేసుకొని మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్న ఈ తరుణంలో కుమార్ వట్టి కరోనాతో మృతి చెందడం తీవ్ర విషాదకరం.

వట్టి కుమార్ ది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట. అవివాహితుడైన ఆయన వయసు 39 సంవత్సరాలు. చాలా ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చారు. ఎంతో ఎత్తుకు ఎదుగాలనుకుని కలలు కన్నారు. వాటిని కరోనా వైరస్ కబళించింది. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న కుమార్ వట్టికి గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్లాస్మా ఎక్కించారు. ఆ క్రమంలోనే ఆయన మరణించినట్టు స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకు అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. కుమార్ వట్టి మృతితో పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. దర్శకుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఇలా అర్థాంతరంగా వెళ్లిపోతాడని ఊహించలేదన్నారు.

kumar vatti

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. కొన్ని రోజుల క్రితం తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య.. దర్శకుడు సాయి బాలాజీ మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్ గుండెపోటుతో మరణించారు. ఆయనకు కరోనా సోకిన తర్వాత అది గుండెపోటుకు దారి తీసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెల్లాదురై గుండెపోటుతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. మొత్తంగా రోజుకో చేదు వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది.