అల్లు అర్జున్ ఈ స్టెప్ ఎలా చేసావు? బన్నీ మూమెంట్స్‌కి బాలీవుడ్ బ్యూటీ ఫిదా

లాక్‌డౌన్ : ‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ పాటలో అల్లు అర్జున్ స్టెప్స్‌కి ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ..

  • Published By: sekhar ,Published On : March 31, 2020 / 12:14 PM IST
అల్లు అర్జున్ ఈ స్టెప్ ఎలా చేసావు? బన్నీ మూమెంట్స్‌కి బాలీవుడ్ బ్యూటీ ఫిదా

లాక్‌డౌన్ : ‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ పాటలో అల్లు అర్జున్ స్టెప్స్‌కి ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల.. వైకుంఠపురములో’.. ఈ సినిమాలో పాటలు, వాటిలో బన్నీ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. సినిమా విడుదల కంటే ముందే ‘సామజవరగమన’, ‘రాములో రాములా’తో పాటు ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే’.. అంటూ సాగే మెలోడీ సాంగ్   ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరించడం విశేషం. తాజాగా బాలీవుడ్ భామ దిశా ప‌టానీ కూడా బుట్ట బొమ్మ‌ పాట‌కు ఫిదా అయ్యింది. ముఖ్యంగా అందులో వాలు ఉప‌రిత‌లంపై జారుతూ బ‌న్నీ వేసే స్టెప్‌ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ‘అల్లు అర్జున్ ఇదెలా చేశావు’ అని కామెంట్ పెట్టింది.

దానికి ‘‘నేను మ్యూజిక్‌నుప్రేమిస్తాను. మంచి మ్యూజిక్ నాతో డాన్స్ చేయిస్తుంది. మీ ప్ర‌శంస‌ల‌కు థాంక్స్‌’’ అంటూ బన్నీ స్పందించాడు. ఇంతకుముందు ‘బుట్టబొమ్మ’ పాటకు శిల్పా శెట్టి బ్యూటిఫుల్ మూమెంట్స్ వేసిన సంగతి తెలిసిందే. టిక్ టాక్‌లో మరింత ఫేమస్ అయ్యిందీ పాట. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేశారు.

dishapatani praises allu arjun's dance

dishapatani praises allu arjun's dance