DJ Tillu: ముచ్చటగా ముగ్గురుని మార్చిన డీజే టిల్లు.. ఎటు వెళ్తుందో?

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో సిద్ధు యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా సీక్వెల్‌కు ప్రేక్షకులు ఊహించని మార్పులు జరుగుతున్నాయి.

DJ Tillu: ముచ్చటగా ముగ్గురుని మార్చిన డీజే టిల్లు.. ఎటు వెళ్తుందో?

DJ Tillu: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో సిద్ధు యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

DJ Tillu2: డీజే టిల్లు తిరిగొచ్చేశాడు.. టైటిల్ టీజర్ రిలీజ్!

ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా సీక్వెల్‌కు ప్రేక్షకులు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను తాను డైరెక్ట్ చేయడం లేదని దర్శకుడు విమల్ కృష్ణ ప్రకటించాడు. ఇక హీరోయిన్‌గా అందాలను ఆరబోసిన నేహా శెట్టి స్థానంలో ఇప్పటికే మరో బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను సెలెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు మరో మార్పును కూడా చేశారు. డీజే టిల్లు సినిమాకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాలను తప్పించి మ్యూజిక్ బాధ్యతలను రామ్ మిర్యాలకు కట్టబెట్టారు.

Sree Leela In For DJ Tillu 2: డీజే టిల్లు కోసం ధమాకా లాంటి బ్యూటీ..?

డీజే టిల్లు ఫస్ట్ పార్ట్‌లో రామ్ మిర్యాల టైటిల్ సాంగ్‌ను పాడగా అది చార్ట్‌బస్టర్‌గా సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆయన్ను ఏకంగా సినిమాకు సంగీతాన్ని అందించేందుకు ఓకే చేశారు. డీజే టిల్లు స్క్వేర్ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.