Ento Emo Jeevitham : ‘మంట ముందు పెట్టాకే పెళ్లి చేస్తారు’.. సాంగ్ అదిరిందిగా..!

‘ఏంటో ఏమో జీవితం ఎందుకిలా చేస్తాదో జీవితం’.. అంటూ సాగే ఈ పాట వైరల్ అవుతోంది..

Ento Emo Jeevitham : ‘మంట ముందు పెట్టాకే పెళ్లి చేస్తారు’.. సాంగ్ అదిరిందిగా..!

Malli Modalaindi

Ento Emo Jeevitham: ‘సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో!’.. అంటూ సోషల్ మీడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే నెట్టింట్లో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజ జీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది. ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ‘ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్‌కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు. ఆ వార్తకూ విపరీతమైన ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే… ఇదంతా పబ్లిసిటీలో భాగంగానే జరిగిందని అనుకోవాలి.

Sumanth : సుమంత్ సెకండ్ మ్యారేజ్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్..

ఎందుకంటే సుమంత్ ఎవరో కాదు.. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో పరిచయం చేసి హీరో. ఇక ‘మళ్ళీ మొదలైంది’లో హీరోయిన్ నైనా గంగూలీనీ టాలీవుడ్‌కు తీసుకొచ్చింది రామ్ గోపాల్ వర్మే. సో, వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ మూవీ గురించి వర్మకు తెలియకుండా ఉండదు. కాబట్టి వీరంతా కలిసే.. ఈ వ్యవహారం నడిపి ఉంటారనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. సుమంత్ గత చిత్రాలకు, ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాలకు రాని ఫ్రీ పబ్లిసిటీ ఈ శుభలేఖ, వర్మ ట్వీట్‌తో ‘మళ్ళీ మొదలైంది’కి వచ్చేసింది.

Sumanth Second Marriage : రెండో పెళ్లి.. ఆర్జీవీ రెస్పాన్స్, సుమంత్ రిప్లయ్.. అసలు నిజం ఇదే

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో.. డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై తెలుగులో వస్తున్న మొదటి సినిమా తమదేనంటూ సుమంత్ చెప్పారు. విశేషం ఏమంటే.. ఇది న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనే విషయాన్ని పోస్టర్‌తో చెప్పేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. దీన్ని యంగ్ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘ఏంటో ఏమో జీవితం… ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా… సాయిచరణ్‌ పాడాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు.

1 Million Views

సహజంగా ఇలాంటి రిలికల్ వీడియోస్ రెగ్యులర్‌గా ఒకే పేట్రన్‌లో ఉంటాయి. కానీ వాటికి కాస్తంత భిన్నంగా దీన్ని సినిమా షూటింగ్ ప్రారంభం నుండి మేకింగ్‌కు సంబంధించిన సీన్స్‌తో నడిపారు. దాంతో ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌కి కూడా ఈ వీడియోలో చోటు దక్కింది. హీరో హీరోయిన్లు సుమంత్, నైనా గంగూలీతో పాటు పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు ఇందులో ఉన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో చక్కటి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. విశేషం ఏమంటే… ఈ మూవీ ప్రమోషన్‌ను కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారన్నది ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్న మీమ్స్ చూస్తే అర్థమౌతోంది. ఈ సినిమాను కీర్తి కుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘మళ్ళీ రావా’ తర్వాత మరోసారి ‘మళ్ళీ మొదలైంది’ తో సుమంత్ హిట్ కొట్టబోతున్నట్లే కనిపిస్తున్నాడు.