Tollywood Audience : బాలీవుడ్, కోలీవుడ్ ఎవరైనా సరే టాలీవుడ్ కి రావాల్సిందే.. తెలుగు ప్రేక్షకుల సినిమాభిమానం..

బ్రహ్మాస్త్రానికి బ్రహ్మరధం పట్టారు, విక్రమ్ కి విజయం ఇచ్చారు, సీతారామంని సూపర్ సక్సెస్ చేశారు, పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ ని సూపర్ సక్సెస్ చేసి సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతే...........

Tollywood Audience : బాలీవుడ్, కోలీవుడ్ ఎవరైనా సరే టాలీవుడ్ కి రావాల్సిందే.. తెలుగు ప్రేక్షకుల సినిమాభిమానం..

every film industry target telugu audience for success

Tollywood Audience :  బాలీవుడ్ లో, కోలీవుడ్ లో వరుస అపజయాలు వెంటాడుతున్న సమయంలో టాలీవుడ్ లో మాత్రం మంచి మంచి సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక దేశమంతటా భారీ విజయం సాధించాయి టాలీవుడ్ సినిమాలు. ఇటీవల హీరో విక్రమ్ తెలుగు వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు అన్నట్టు తెలుగు ప్రేక్షకులు బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలని ఆదరిస్తారు అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. దీంతో అన్ని పరిశ్రమల వాళ్ళు టాలీవుడ్ ని టార్గెట్ చేసుకొని ప్రమోషన్స్ చేస్తున్నారు.

బ్రహ్మాస్త్రానికి బ్రహ్మరధం పట్టారు, విక్రమ్ కి విజయం ఇచ్చారు, సీతారామంని సూపర్ సక్సెస్ చేశారు, పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ ని సూపర్ సక్సెస్ చేసి సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా అదరిస్తారు. తమిళ్, మళయాళ, హిందీ ఇలా ఏ హీరో అయినా సరే మా వాడే అని హిట్స్ ఇస్తారు. అందుకే స్టార్లు కూడా క్రేజీ ఆడియన్స్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

Nagarjuna : చైతో చేశాను.. త్వరలో అఖిల్ తో చేయబోతున్నాను.. ఏజెంట్, ఘోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించండి..

సినిమా బావుంటే చాలు స్టార్ డమ్ సంగతి పట్టించుకోరు. కంటెంట్ బావుంటే చాలు ఏ భాష అన్నది అస్సలు పట్టించుకోరు తెలుగు ప్రేక్షకులు. అందుకే భాషతో సంబందం లేకుండా ఏ సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చినా ఆదిరిస్తున్నారు. లేటెస్ట్ గా పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తమిళ్ సినిమా అయినా తెలుగు ఆడియన్స్ టీమ్ అందరికీ వామ్ వెల్ కమ్ చెప్పారు. ఒక్క హాయ్ చెబితే చాలు, నచ్చేలా ఒక్క మాట మాట్లాడితే చాలు, మనసులో మంచి స్థానాన్ని ఇస్తారు తెలుగు ఆడియన్స్. అందుకే తమిళ్ డైరెక్టర్, తమిళ్ స్టార్ కాస్ట్ అయినా తెలుగు ఆడియన్స్ సినిమా మీద హైప్ తెచ్చేశారు.

హిందీ సినిమా అయినా తెలుగులో డీసెంట్ సక్సస్ సాధించింది బ్రహ్మాస్త్ర. తెలుగు ఆడియన్స్ కి ఏమాత్రం సంబందం లేని హీరో రణబీర్ ని, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ని అంతే హార్ట్ ఫుల్ గా వెల్ కమ్ చెప్పారు తెలుగు ఆడియన్స్. కరణ్ జోహార్ అయితే తెలుగు ఆడియన్స్ ని, తెలుగు జనాల టేస్ట్ ని ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశారు. అందుకే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కూడా టాలీవుడ్ లో గట్టిగానే చేశారు టీమ్.

FNCC Elections : ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో బండ్ల గణేష్ ఓటమి.. అధ్యక్షుడిగా కృష్ణ సోదరుడు..

తెలుగు ఆడియన్స్ అందర్నీ టాలీవుడ్ లో కలిపేసుకుంటారు కాబట్టే మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుసగా సక్సెస్ లు అందుకున్నారు. ఇటీవల సీతారామం సినిమాతో మళయాళ హీరో దుల్కర్ టాలీవుడ్ లో మంచి స్థానం సంపాదించుకున్నారు. దుల్కర్ సల్మాన్ కి భీమవరంలో పెద్ద కటౌట్ పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు మన తెలుగు ప్రేక్షకుల గొప్పతనం. తెలుగు ఆడియన్స్ కి మంచి కథ ఉంటే చాలు క్రేజీగా చూస్తారు, మంచి కథని ఆదరిస్తారంటూ ఆకాశానికెత్తేశారు దుల్కర్.

సినిమాలని మాత్రమే ఆదరించడం కాదు, వేరే భాషల హీరోలు, హీరోయిన్స్ కి కూడా తెలుగులో అభిమానులు భారీగానే ఉంటున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల హీరోలు తమ సినిమాలని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ సినిమాలకి బాగా వసూళ్లు వస్తుండటంతో నిర్మాతలు కూడా తెలుగులో రిలీజ్ కి రెడీ అంటున్నారు. ఇక ప్రమోషన్స్ అయితే వాళ్ళ సొంత భాషల్లో కంటే తెలుగులోనే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలకి, సినిమా వసూళ్లకు టాలీవుడ్ ఇండియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుందంటే అంతా తెలుగు ప్రేక్షకుల గొప్పతనమే.