Rajamouli: రాజమౌళి సినిమాలో పనిచెయ్యాలంటే సమస్య ఇదే -రామ్ లక్ష్మణ్

Rajamouli: రాజమౌళి సినిమాలో పనిచెయ్యాలంటే సమస్య ఇదే -రామ్ లక్ష్మణ్

Ram Laxman

Fight Masters Ram Laxman: దర్శకధీరుడు రాజమౌళితో పనిచేసిన ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌లు.. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి సినిమాల్లో పనిచేసినా పేరు రాదని అన్నారు. రాజమౌళి సినిమాలో చేసినా కూడా క్రెడిట్ తీసుకోవడం కరెక్ట్ అనిపించదని అన్నారు.

రాజమౌళి గారికి ప్రతీదానిపై ఓ క్లారిటీ విజన్ ఉంటుంది. అందుకే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. ఆయన ప్రతీ సంధర్భంలోనూ, స్టంట్స్‌ విషయంలోనూ పక్కనే ఉండి పర్యవేక్షిస్తాడు. దీంతో స్టంట్స్ మేమే చేశామనే ఫీలింగ్ ఉండదని చెప్పుకొచ్చారు. తమకే కాదు.. ‘రాజమౌళి సినిమాలకు ఎవరు పని చేసినా కూడా స్టంట్స్ విషయంలో మాస్టర్స్‌కు పెద్దగా పేరు రాదు.. క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది’ అని చెప్పుకొచ్చారు. ఇదే రాజమౌళి సినిమాలో పనిచెయ్యాలంటే సమస్య అన్నారు రామ్ లక్ష్మణ్.

కానీ, రాజమౌళి సినిమాలకు పని చేయడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, రాజమౌళి సినిమాలకు పనిచెయ్యాలంటే కనీసం 40 నుంచి 60 రోజుల డేట్స్‌ ఇవ్వాలన్నారు రామ్ లక్ష్మణ్. ఎప్పుడైనా రమ్మంటే సిద్ధంగా ఉండాలని, టైం లేదు, ఇప్పుడు కుదరదు అనే మాటలు చేబితే అస్సలు నచ్చదన్నారు. డేట్స్ ఎక్కువగా ఇవ్వలేకపోవడమే వల్ల తాము బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు పని చేయలేకపోయినట్లు వెల్లడించారు.