S.V.Krishna Reddy: ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ దర్శకుడు.. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ!

తెలుగు సినిమాలో ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి, నటుడిగా తన సత్తా చాటిన ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. పెద్ద హీరోలతో కాకుండా చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ..

S.V.Krishna Reddy: ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ దర్శకుడు.. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ!

S.v.krishna Reddy

S.V.Krishna Reddy: తెలుగు సినిమాలో ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి, నటుడిగా తన సత్తా చాటిన ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. పెద్ద హీరోలతో కాకుండా చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ మంచి విజయాలు అందున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. మ్యూజిక్, డ్యాన్స్, డైరెక్షన్ ఒక్కటేమిటి మల్టీటాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నారు. కథ, కథనాలపై కూడా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పట్టువుంది. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ఈ విషయాలను నిరూపించాయి.

Vaani Kapoor: పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్ సోయగం వాణీ కపూర్!

ఒకప్పుడు వెండి తెరపై తనదైన కామెడీ మార్క్ తో రారాజుగా నిలిచారు ఎస్వీకృష్ణారెడ్డి గత కొంత కాలంగా సినిమాల జోలికి వెళ్లడం లేదు. ఆ మధ్య ఆయన సీరియల్స్ వైపుకు వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ అవేమీ నిజం కాలేదు. అయితే.. ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వూలో మాట్లాడిన ఆయన సరికొత్తగా యూత్ నచ్చేలా.. యంగ్ దర్శకులకు పోటీ ఇచ్చేలా కథలను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమా విడుదల వచ్చేసింది!

ఇప్పటికే లాక్ డౌన్ లో కొన్ని కథలను సిద్ధం చేసుకున్నట్లు చెప్పిన ఆయన ఇప్పటికే నిర్మాతలు కూడా ఒకే చేశారని.. త్వరలోనే నటీనటుల ఎంపిక చేపట్టి సినిమాను మొదలు పెట్టనున్నట్లుగా చెప్పుకొచ్చారు. పదేళ్ల గ్యాప్ వచ్చినా ఇటు ప్రేక్షకులు గానీ.. అటు ఇండస్ట్రీగాని తనని మరిచిపోలేదని.. అది తన అదృష్టంగా చెప్పుకున్న కృష్ణారెడ్డి.. ఒక దశ తరువాత సొంత సినిమాలు తీయకూడదని నిర్ణయించుకుని.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం వల్లనే గ్యాప్ వచ్చేసిందని.. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చెప్పారు.