ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు జార్జ్ రెడ్డి

  • Published By: vamsi ,Published On : December 22, 2019 / 05:05 AM IST
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు జార్జ్ రెడ్డి

చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపైకి తీసుకుని వచ్చిన సినిమా ‘జార్జ్ రెడ్డి’.. ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే పేరుతో సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌‌లో నటించగా.. ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. జార్జ్ రెడ్డి లాంటి అత్యంత ప్రతిభావతుండైన, ప్రభావవంతుడైన యువ నాయకుని గురించి భావి తరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన చిత్ర యూనిట్.. ఆ విషయాన్ని చెప్పడంలో సక్సెస్ అయ్యింది. 

అయితే ఈ సినిమా లేటెస్ట్‌గా 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ మేరకు డిసెంబర్ 22 మరియు 23 తేదీల్లో ఈ సినిమాని అక్కడ ప్రదర్శించనున్నారు. నోయిడా, ఢిల్లీలో ప్రత్యేక ప్రదర్శనలు వేయనున్నారు. జార్జ్ రెడ్డి సినిమా ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ హాజరు కానుంది.