Ginna: జిన్నా, ఓరి దేవుడా చిత్రాలకు బ్యాడ్ ‘టైమ్’ ఎఫెక్ట్..?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి శుక్రవారం ఒక హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి దీపావళి పండగను క్యాష్ చేసుకుందామని ఇద్దరు తెలుగు హీరోలు, ఇద్దరు తమిళ హీరోలు ఒకేసారి పోటీకి దిగారు. వీరిలో మంచు విష్ణు, విశ్వక్ సేన్ తమ సినిమాలను రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేశామని ఇప్పుడు బాధపడుతున్నారు.

Ginna: జిన్నా, ఓరి దేవుడా చిత్రాలకు బ్యాడ్ ‘టైమ్’ ఎఫెక్ట్..?

Ginna Ori Devuda Movies Effected With Wrong Time Release

Ginna: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి శుక్రవారం ఒక హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి దీపావళి పండగను క్యాష్ చేసుకుందామని ఇద్దరు తెలుగు హీరోలు, ఇద్దరు తమిళ హీరోలు ఒకేసారి పోటీకి దిగారు. దీంతో ఈ నలుగురు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ఒకేరోజున తమ సినిమాలను రిలీజ్ చేసి ఉండకూడదని వారు భావిస్తున్నారు.

Ginna: రంగంపేట ప్రెసిడెంట్ తిప్పేస్వామిగా ఎంట్రీ ఇచ్చిన రఘుబాబు

యంగ్ హీరో మంచు విష్ణు చాలా రోజుల తరువాత పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ‘జిన్నా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అందాల భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు అదనపు ఆకర్షణలుగా నిలిచారు. అటు మరో మాస్ హీరో విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ అనే మూవీతో వచ్చాడు. ఈ సినిమాలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ రెండు సినిమాలకు రెస్పాన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు.

Ori Devuda Heroines: “నాటు నాటు” స్టెప్ వేసి అదరగొట్టిన విశ్వక్ సేన్ హీరోయిన్లు..

అటు తమిళ హీరో కార్తి కూడా ఈసారి విభిన్నమైన కథాంశంతో ‘సర్దార్’ అనే సినిమాతో వచ్చాడు. ఆయనకు పోటీగా జాతిరత్నాలు ఫేం దర్శకుడు అనుదీప్‌తో కలిసి శివకార్తికేయన్ ‘ప్రిన్స్’గా బరిలోకి దిగాడు. ఈ రెండు సినిమాలకు టాక్ బాగున్నా, కలెక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. దీంతో దీపావళి పండగకు రీసౌండ్ చేస్తాయని అనుకున్న నాలుగు సినిమాలు కూడా తుస్సుమనిపించాయి.

Sardar: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్దార్.. రన్‌టైమ్ ఎంతంటే?

అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జిన్నా, ఓరి దేవుడా చిత్రాల గురించి. ఈ రెండు సినిమాలు కూడా రెండు విభిన్నమైన జోనర్‌లకు చెందిన సినిమాలు. ఈ సినిమాలు గనక సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వచ్చేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కన జిన్నా, ఓరి దేవుడా చిత్రాల రిజల్ట్‌కు బ్యాడ్ ‘టైమింగ్’ కారణమని వారు అంటున్నారు.