GodFather Collections : గాడ్‌ఫాదర్ రెండు రోజుల కలెక్షన్స్.. బాస్ అస్సలు తగ్గట్లేదుగా.. 100 కోట్లు గ్యారెంటీ.

గాడ్‌ఫాదర్ సినిమా మొదటి రోజు పండగపూట ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా పండగ సెలవులు వీకెండ్ వరకు ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ కి ఢోకా లేదని మొదటి రోజే అర్థమైపోయింది. ఇక గాడ్‌ఫాదర్ సినిమా రెండో రోజు...............

GodFather Collections : గాడ్‌ఫాదర్ రెండు రోజుల కలెక్షన్స్.. బాస్ అస్సలు తగ్గట్లేదుగా.. 100 కోట్లు గ్యారెంటీ.

GodFather Collections in Two Days

GodFather Collections :  చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్‌ఫాదర్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మలయాళం లూసిఫర్ సినిమాకి రీమేక్ అయినా కూడా దానికంటే బాగుందని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. చిరంజీవి మాస్ ఇమేజ్ కి తగ్గ సినిమా చాలా రోజుల తర్వాత పడటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపులా నుంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.

గాడ్‌ఫాదర్ సినిమా మొదటి రోజు పండగపూట ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా పండగ సెలవులు వీకెండ్ వరకు ఉండటం, సినిమా హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ కి ఢోకా లేదని మొదటి రోజే అర్థమైపోయింది. ఇక గాడ్‌ఫాదర్ సినిమా రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మొత్తానికి రెండు రోజుల్లో చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమా 69.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Alia Bhatt : ఘనంగా అలియాభట్ సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఎలాగో సినిమా హిట్ టాక్ రావడం, వీకెండ్ ఉండటంతో ఇలాగే కంటిన్యూ అయితే మొదటి వారంలోనే గాడ్‌ఫాదర్ 100 కోట్ల కలెక్షన్స్ ని ఈజీగా రాబడుతుంది అంటున్నారు సినీ వర్గాలు. సినిమా సూపర్ హిట్ అయి, తమ అభిమాన హీరోని చాలా బాగా చూపించడం, కలెక్షన్స్ కూడా బాగా రావడంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.