నరేంద్ర మోదీ బయోపిక్‌లో అమిత్ షా ఇతనే!

నరేంద్ర మోదీ బయోపిక్‌లో అమిత్ షా ఇతనే!

నరేంద్ర మోదీ బయోపిక్‌లో అమిత్ షా లుక్ రిలీజ్..

నరేంద్ర మోదీ బయోపిక్‌లో అమిత్ షా ఇతనే!

నరేంద్ర మోదీ బయోపిక్‌లో అమిత్ షా లుక్ రిలీజ్..

గతకొంత కాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. మెజారిటీ భాగం బయోపిక్‌లు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు మరో ప్రయోగాత్మక బయోపిక్‌కి రంగం సిద్ధమయ్యింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్.. ఇటీవలే రిలీజ్ అవగా.. ఇప్పుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా.. పీఎమ్ నరేంద్రమోదీ పేరుతో ఒక సినిమా రాబోతుంది. ‘దేశ భక్తే నా శక్తి’ అనే క్యాప్షన్ పెట్టారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నరేంద్ర మోదీగా నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీలో భాజాపా అధ్యక్షుడు అమిత్ షా లుక్ రిలీజ్ చేసారు.

మోదీ బయోపిక్‌లో, అమిత్ షా క్యారెక్టర్ మనోజ్ జోషి నటిస్తున్నాడు. గెటప్, బాడీ లాంగ్వేజ్ పరంగా.. అచ్చుగుద్దినట్టు అమిత్ షా లా మారిపోయాడు మనోజ్ జోషి.. 23 భారతీయ భాషల్లో  పీఎమ్ నరేంద్రమోదీ సినిమాని విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం : ఒమంగ్ కుమార్, నిర్మాతలు : సురేష్ ఒబెరాయ్, సందీప్ ఎస్‌సింగ్.  
 

×