Ileana D’Cruz : తన బిడ్డతో ఉన్న ఫోటోని షేర్ చేసిన ఇలియానా.. అప్పుడే రెండు నెలలు..
ఇలియానా తన కొడుకుతో ఉన్న ఒక క్యూట్ ఫోటోని షేర్ చేసింది. అప్పుడే రెండు నెలలు అంటూ..

Ileana DCruz shares new photo with her new born baby boy
Ileana D’Cruz : గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో స్టార్డమ్ ని అందుకొని బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యిపోయింది. ఇక ప్రస్తుతం సినిమా అవకాశాలు లేని ఈ భామ.. పెళ్లి వార్త చెప్పకుండా డైరెక్ట్ గా ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అసలు ఇలియానా ఎప్పుడు పెళ్లి చేసుకుంది..? ఎవరిని చేసుకుంది..? అనే సందేహం మొదలైంది. ఈ విషయం గురించి ఆమెను సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్, ఫ్యాన్స్ ప్రశ్నిస్తూనే వస్తున్నారు. అయితే ఆ విషయానికి మాత్రం ఇలియానా ఇప్పటి వరకు బదులివ్వలేదు.
Also Read : Rajinikanth : రజినీకాంత్ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో తెలుసా..?
కాగా ఆగస్టు 1న ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. బాబు ఫోటోని షేర్ చేస్తూ.. ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అనే పేరు పెట్టినట్టు ప్రకటించింది. ఇక ఆ విషయం చెప్పినప్పుడు కూడా నెటిజెన్స్.. కంగ్రాట్స్ చెప్తూనే బాబు తండ్రి ఎవరో ఇప్పటికైనా చెప్పమని కామెంట్స్ చేశారు. ఆ పోస్ట్ తరువాత ఇలియానా సోషల్ మీడియాలో ఇన్ యాక్టీవ్ అయ్యిపోయింది. రెండు నెలలు తరువాత మళ్ళీ ఇప్పుడు ఒక పోస్ట్ వేసింది.
Also Read : NTR – War 2 : ఎన్టీఆర్‌ని కలిసిన వార్ 2 దర్శకుడు.. షూటింగ్ ఎప్పుడు మొదలు..?
తన కొడుకుతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. బిడ్డ పుట్టి అప్పుడే రెండు నెలలు పూర్తి అయ్యిపోయిందంటూ పేర్కొంది. ఫొటోలో బాబు ఇలియానా భుజంపై పడుకొని కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు, నెటిజెన్స్.. ‘సో క్యూట్, బ్యూటిఫుల్ పిక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత ఇలియానా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ పిక్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
View this post on Instagram