Rajinikanth : రజినీకాంత్ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో తెలుసా..?
రజినీకాంత్ కెరీర్లో 170వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకుడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

Three heroines in Rajinikanth new movie
Rajinikanth 170 Movie : జైలర్ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్‌లో ఉన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). ఈ క్రమంలో ఆయన తన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ కెరీర్లో 170వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకుడు. తలైవా 170 (Thalaivar 170) వర్కింగ్ టైటిట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు.
Premalo Papalu Babulu : ‘ప్రేమలో.. పాపలు బాబులు’ టైటిలే కాదు.. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది..
అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారు ఎవరో కాదు.. మంజూ వారియర్ (Manju Warrier), రితికా సింగ్ (Ritika Singh), దుషారా విజయన్ (Dushara Vijayan). ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో కీలక పాత్రలో టాలీవుడ్ హీరో నాని ని నటింపజేసేందుకు చిత్ర బృందం సంప్రదించిందని టాక్. అయితే.. నాని ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించడంతో ఆ ఛాన్స్ శర్వానంద్‌కు దక్కిందనే వార్తలు వచ్చాయి.
Neha Shetty : అప్పుడు ఆ జర్నలిస్ట్‌తో గొడవ.. ఇప్పుడు కలిసి డాన్స్..
కాగా.. శర్వానంద్ కూడా ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో దగ్గుబాటి రానా వద్దకు ఆ అవకాశం వెళ్లిందని అంటున్నారు. మరీ ఈ ముగ్గురిలో తలైవా రజినీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకునేది ఎవరో అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జైభీమ్ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్.. రజినీకాంత్‌ను ఎలాంటి పాత్రలో చూపించనున్నాడు అనే ఆసక్తి అందరిలో ఉంది.