Premalo Papalu Babulu : ‘ప్రేమలో.. పాపలు బాబులు’ టైటిలే కాదు.. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది..
మురళీ మోహన్ చేతులు మీదుగా ‘ప్రేమలో.. పాపలు బాబులు’ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్.

Premalo Papalu Babulu poster release by actor Murali Mohan
Premalo Papalu Babulu : శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమలో..’. ‘పాపలు బాబులు’ అనేది ట్యాగ్ లైన్. అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరాజ్ బల్లా తెరకెక్కిస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాత. సోమవారం ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూవీ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
Also Read : NTR – War 2 : ఎన్టీఆర్‌ని కలిసిన వార్ 2 దర్శకుడు.. షూటింగ్ ఎప్పుడు మొదలు..?
ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నిర్మాత లయన్ సాయి వెంకట్,నటుడు సమీర్, నిర్మాత విజయ మాధవి, డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా, హీరో అభిదేవ్, సినిమాటోగ్రాఫర్ వంశీ, ఎస్.జి..ఆర్, మ్యూజిక్ డైరెక్టర్స్ రవి బల్లా, ఫ్రాంక్లింగ్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యానర్ లోగోను తుమ్మల పల్లి రామసత్యనారాయణ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ప్రేమలో పాపలు, బాబులు అనే టైటిల్ కొత్తగా ఉంది. కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read : NTR Adhurs : చారి, భట్టు మళ్ళీ వస్తున్నారు.. అదుర్స్ రీ రిలీజ్ ఫిక్స్..
ఇక నటుడు సమీర్ మాట్లాడుతూ.. ‘మురళీ మోహన్ గారు ఇలా ఇక్కడకి రావడమే ఈ సినిమా మొదటి సక్సెస్. ఆయనది లక్కీ హ్యాండ్. రామసత్య నారాయణ గారు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. నా మిత్రుడు శ్రీరాజ్ తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. దర్శకుడు శ్రీరాజ్ మాట్లాడుతూ.. మురళీ మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరారు.