సల్మాన్‌తో రెండు సినిమాలు వదులుకున్నా.. ఇప్పుడు ఫీలవుతున్నా..

గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన రెండుసార్లు హీరోయిన్‌గా నటించే అవకాశం కోల్పోయానని ఇటీవల ఓ ఇంటర్వూలో తెలిపింది..

  • Published By: sekhar ,Published On : November 29, 2019 / 07:43 AM IST
సల్మాన్‌తో రెండు సినిమాలు వదులుకున్నా.. ఇప్పుడు ఫీలవుతున్నా..

గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన రెండుసార్లు హీరోయిన్‌గా నటించే అవకాశం కోల్పోయానని ఇటీవల ఓ ఇంటర్వూలో తెలిపింది..

ఇలియానా.. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అవడానికి బీభత్సంగా ప్రయత్తిస్తోంది. ఆ ప్రాసెస్‌లో భాగంగా లేటెస్ట్ పిక్స్ అప్ లోడ్ చేస్తూ, అడిగిమరీ ఇంటర్వూలిస్తూ ఉంది. ఇటీవల ఓ ఇంటర్వూలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో నటించే చాన్స్ మిస్ అయ్యానని చెప్తూ తెగ ఫీల్ అయిపోయింది. సాధారణంగా సల్లూ భాయ్ సినిమాలతోనే కొంతమంది హీరోయిన్స్ పాపులర్ అయ్యారు.. స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. కానీ ఇలియానాకు ఆ అదృష్టం లేనట్టుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. సల్మాన్ నటించిన ‘వాంటెడ్’, ‘కిక్’ సినిమాలలో మొదట కథానాయికగా ఇలియానాను సంప్రదించారట. 2009లో వచ్చిన ‘వాంటెడ్’ తెలుగు ‘పోకిరి’ రీమేక్. తెలుగులో చేసిన హీరోయిన్ అయితే బాగుంటుందని ఇల్లీ బేబిని అడగగా, ఎగ్జామ్స్ కారణంగా కుదరలేదని చెప్పింది.  

అలాగే తెలుగు ‘కిక్’ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేయగా, అప్పుడూ ఒరిజినల్ వెర్షన్‌లో నటించిన ఇలియానాను సంప్రదించగా.. వేరే సినిమాలు కమిట్ అవడం, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తప్పుకోక తప్పలేదని.. రెండు సార్లు సల్మాన్‌తో నటించే చాన్స్ మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇలియానా నటించిన హిందీ సినిమా ‘పాగల్ పంతీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.