Indian 2 : దేశాలు తిరిగేస్తున్న లోకనాయకుడు.. తైవాన్ లో ఇండియన్ 2 షూటింగ్..

కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. కాజల్, రకుల్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ ని పెట్టి తీస్తున్నారు. సాధారణంగానే శంకర్ సినిమా అంటే దేశ విదేశాల్లో..................

Indian 2 : దేశాలు తిరిగేస్తున్న లోకనాయకుడు.. తైవాన్ లో ఇండియన్ 2 షూటింగ్..

Indian 2 movie shooting in Taiwan and South Africa back to back schedules

Indian 2 :  కమల్ హాసన్(Kamal Haasan) గత సంవత్సరం విక్రమ్(Vikram) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. విక్రమ్ సినిమా ఇచ్చిన భారీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చి మళ్ళీ ఆగిపోయిన సినిమా షూటింగ్స్ మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే గతంలో ఆగిన ఇండియన్ 2(Indian 2) సినిమా(Cinema) షూటింగ్ మొదలుపెట్టి శరవేగంగా చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్(Shankar) ఒకేసారి చరణ్(Charan) తో గేమ్ ఛేంజర్(Game Changer), కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. రెండు సినిమా షూటింగ్స్ వెంటవెంటనే జరుగుతున్నాయి.

ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. కాజల్, రకుల్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ ని పెట్టి తీస్తున్నారు. సాధారణంగానే శంకర్ సినిమా అంటే దేశ విదేశాల్లో షూటింగ్ చేస్తాడు. ఇప్పుడు ఇండియన్ 2 సినిమాకి కూడా అదే చేస్తున్నాడు. ఇటీవల ఆంద్రప్రదేశ్ లో ఇండియన్ 2 షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆఫ్రికాకు వెళ్లారు. ఇప్పుడు తైవాన్ కు వెళ్లనున్నారు. అనంతరం మళ్ళీ ఆఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ కు వెళ్లనున్నారు ఇండియన్ 2 టీం.

Samantha : మరో బిజినెస్ లోకి సమంత ఎంట్రీ.. ఈ సారి ఏంటో తెలుసా??

శంకర్ ఇటీవలే చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఓ షెడ్యూల్ ని పూర్తి చేశాడు. మరో నాలుగు రోజుల్లో కమల్ హాసన్, ఇండియన్ 2 టీంతో ఏప్రిల్ 1న తైవాన్ కి వెళ్లనున్నాడు. అక్కడ 4 రోజులు షూటింగ్ చేసిన అనంతరం ఆఫ్రికా జోహాన్స్ బర్గ్ కి వెళ్లి ఈ మంత్ ఎండింగ్ వరకు అక్కడే ఇండియన్ 2 సినిమా షూట్ చేయనున్నారు. ఇలా దేశ విదేశాలు తిరుగుతూ ఇండియన్ 2ని కూడా భారీగా తెరకెకెక్కిస్తున్నాడు శంకర్.