Jacqueline Fernandez : ‘రక్కమ్మ’ లుక్ అదిరింది..

అందాలారబోస్తూ, మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి కిక్ ఇచ్చేలా కిరాక్ ఉంది జాక్వెలిన్ లుక్..

10TV Telugu News

Jacqueline Fernandez: శాండల్‌వుడ్‌ బాద్‌షా, అభినయ చక్రవర్తి, కిచ్చా సుదీప్ నటుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటిస్తున్న ‘విక్రాంత్ రోనా’‌ (ది వరల్డ్ ఆఫ్ ఫాంటమ్) టైటిల్‌ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో విడుదల చేసి, సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Sudeep

రీసెంట్‌గా ఈ మూవీలో కిచ్చాకు జోడీగా నటిస్తున్న శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘విక్రాంత్ రోనా’ లో ‘గడంగ్ రక్కమ్మ’ క్యారెక్టర్‌లో కనిపించనుందీ పొడుగుకాళ్ల సుందరి. అందాలారబోస్తూ, మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి కిక్ ఇచ్చేలా కిరాక్ ఉంది జాక్వెలిన్ లుక్.

Vikrant Rona Team

 

నీతా అశోక్ మరో కథానాయికగా నటిస్తున్న ‘విక్రాంత్ రోనా’‌ ఫిల్మ్‌ని షాలిని ఆర్ట్స్ బ్యానర్ మీద షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్ నిర్మిస్తుండగా.. అనూప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలతో సహా ఐదు విదేశీ భాషల్లో.. 50 దేశాల్లో ‘విక్రాంత్ రోనా’‌ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నారు.

10TV Telugu News