విశాల్‌కి విలన్‌గా జగ్గుభాయ్

విశాల్ హీరోగా సుందర్.సి. డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమాలో జగపతి విలన్‌గా నటిస్తున్నాడు.

  • Published By: sekhar ,Published On : January 26, 2019 / 11:17 AM IST
విశాల్‌కి విలన్‌గా జగ్గుభాయ్

విశాల్ హీరోగా సుందర్.సి. డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమాలో జగపతి విలన్‌గా నటిస్తున్నాడు.

 జగపతి బాబు ప్రస్తుతం స్టైలిష్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం వంటి లాంగ్వేజెస్‌లో వరసగా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది రంగస్థలంలో ఫణీంద్ర భూపతి, అరవింద సమేతలో బసిరెడ్డి క్యారెక్టర్లతో తనలోని సరికొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ మధ్య తమిళ్‌లో తల అజిత్ విశ్వాసం సినిమాలో విలన్‌గా నటించిన జగ్గుభాయ్‌కి, తమిళ్ ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కోలీవుడ్‌లో మరో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జగపతి బాబు. విశాల్ హీరోగా సుందర్.సి. డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమాలో జగపతి విలన్‌గా నటిస్తున్నాడు. విశాల్‌కిది 27వ సినిమా.

ఇంతకుముందు విశాల్ కత్తిసండై సినిమాలో జగపతి బాబు విలన్‌గా నటించాడు. ఆ సినిమా తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు.  సుందర్.సి. శింబు హీరోగా, అత్తారింటికి దారేది రీమేక్ చేస్తున్నాడు. మరికొద్ది రోజల్లో ఆ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత విశాల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.