Jai Bhim : అరుదైన ఘనత సాధించిన సూర్య సినిమా!

సూర్య నటిస్తూ, నిర్మించిన ‘జై భీమ్’ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది..

Jai Bhim : అరుదైన ఘనత సాధించిన సూర్య సినిమా!

Jai Bhim Oscars

Jai Bhim: తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గతేడాది నవంబర్ 2 నుండి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ‘జై భీమ్’ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Etharkkum Thunindhavan : సూర్య సినిమా పాన్ ఇండియా రిలీజ్!

సూర్య హీరోగా నటించడంతో పాటు 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద భార్య జ్యోతికతో కలిసి నిర్మించారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు. ‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. రాజకన్ను, పార్వతి అనే దంపతుల కథను ఆధారంగా చేసుకుని.. రాజన్న, సినతల్లి క్యారెక్టర్లను తయారు చేశారు దర్శకుడు.

RajiniKanth : ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. రజినీ ధైర్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పోస్టులు

సినతల్లిగా లిజోమోల్ జోస్, రాజన్నగా కె.మణికందన్ వారి పాత్రల్లో జీవించేశారు. సినతల్లి క్యారెక్టర్‌కు మహిళలతో పాటు అందరూ కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్స్‌కి ఇన్విటేషన్ పొందిన ‘జై భీమ్’ చిత్రానికి మరో అరుదైన ఘనత దక్కింది.

Sreeja : భర్త పేరు తీసేసిన చిరంజీవి కూతురు.. సమంతని ఫాలో అవుతుందా??

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్స్ యూట్యూబ్ ఛానల్‌లో ‘జై భీమ్’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని అప్‌లోడ్ చేశారు. ఆ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ‘జై భీమ్ సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో సినిమా స్టార్టింగ్‌లో రిమాండ్‌కు వచ్చిన దోషుల్ని పోలీసులు లంచాలు తీసుకుని, కులాల ప్రకారం విభజించి వారిని తరలించే సన్నివేశం ఆస్కార్స్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారమవుతుంది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమా కూడా ఈ ఘనత దక్కించుకోలేదు. దీంతో ఇది మన ఇండియన్ సినిమాకే గర్వకారణం అంటూ సినీ వర్గాలవారు, మూవీ లవర్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.