Kajal Aggarwal: హార్రర్ కామెడీగా కాజల్ కొత్త సినిమా.. శాటిలైట్ రైట్స్ ఆ చానల్‌కే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్, పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే పలు సినిమాలను ఓకే చేసిన కాజల్, తాజాగా ఓ హార్రార్ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Kajal Aggarwal: హార్రర్ కామెడీగా కాజల్ కొత్త సినిమా.. శాటిలైట్ రైట్స్ ఆ చానల్‌కే!

Kajal Aggarwal Starrer Ghosty Locks Satellite Partner

Kajal Aggarawal: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్, పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే పలు సినిమాలను ఓకే చేసిన కాజల్, తాజాగా ఓ హార్రార్ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Kajal Aggarwal : కాజల్ కంబ్యాక్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.. చేతిలో అరడజను ప్రాజెక్టులు..

ఘోస్టీ అనే టైటిల్‌తో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో కాజల్ ఓ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాను మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమాలో కాజల్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Kajal Aggarwal: సినిమాలు చేయమంటోన్న కాజల్ భర్త.. కానీ కండీషన్లు మామూలుగా లేవుగా!

ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, యోగి బాబు, కెఎస్ రవికుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాను కల్యాణ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా, ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుందని.. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జీ తమిళ్ సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.