Kajol : సీనియర్ హీరోయిన్ డైరెక్షన్‌లో మరో సీనియర్ హీరోయిన్ సినిమా

రేవతి డైరెక్షన్ లో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ మెయిన్ లీడ్ గా సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘సలామ్‌ వెంకీ’ అనే టైటిల్.......

Kajol :  సీనియర్ హీరోయిన్ డైరెక్షన్‌లో మరో సీనియర్ హీరోయిన్ సినిమా

Revathi

Revathi :  భారత సినీ పరిశ్రమలో చాలా మంది మహిళా దర్శకులు కూడా ఉన్నారు. హీరోయిన్స్ దర్శకులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేవతి ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. ఒకపక్క నటిస్తూనే మరో పక్క డైరెక్షన్ కూడా చేస్తుంది. ఇప్పటికే రేవతి డైరెక్షన్ లో నాలుగు సినిమాలు తెరకెక్కాయి. తాజాగా మరో సినిమాని డైరెక్ట్ చేయబోతుంది రేవతి.

రేవతి డైరెక్షన్ లో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ మెయిన్ లీడ్ గా సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘సలామ్‌ వెంకీ’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా గురించి కాజోల్ పోస్ట్ చేస్తూ.. ”అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలుపెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలి? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని తెలిపారు.

James : పునీత్ పై ఎమోషనల్ పోస్ట్ చేసిన ప్రభాస్..

అటు రేవతి కూడా ఈ సినిమా గురించి పోస్ట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా హిందీతో పాటు వేరే భాషల్లోనూ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol)