Sarath Babu : శరత్ బాబు మరణం పై సెలబ్రిటీస్ సంతాపం.. ఫ్రెండ్‌ని కోల్పోయామన్న కమల్, రజినీ!

శరత్ బాబు మరణానికి చింతిస్తూ కమల్ హాసన్, మంచు విష్ణు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, జయసుధ సంతాపం తెలియజేశారు.

Sarath Babu : శరత్ బాబు మరణం పై సెలబ్రిటీస్ సంతాపం.. ఫ్రెండ్‌ని కోల్పోయామన్న కమల్, రజినీ!

Kamal Haasan Manchu Vishnu and other celebrities condolence on Sarath Babu demise

Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు నేడు (మే 22) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడంతో హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) హాస్పిటల్ లో శరత్ బాబు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినిమా ప్రముఖులు, అభిమానులు శరత్ బాబుకి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ (Kamal Haasan), మంచు విష్ణు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, జయసుధ సంతాపం తెలియజేశారు.

Chiranjeevi – Pawan Kalyan : శరత్ బాబుకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులు.. వెండితెర జమిందార్ శరత్ బాబు!

నరేష్..

“శరత్ బాబు గొప్పనటుడు, అందగాడు. ఆయన నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాను. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి నేను చాలాసార్లు అసూయపడేవాడిని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పారు. మనసు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుడిని కోల్పోయాను. మా బ్యానర్ లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు” అంటూ విచారం వ్యక్తం చేశాడు.

రాజేంద్రప్రసాద్..

“శరత్ బాబు మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. ఆరోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు” అంటూ రాజేంద్రప్రసాద్ బాధ పడ్డాడు.

Balakrishna : శరత్ బాబుకి బాలకృష్ణ నివాళులు.. ఆయనతో కలసి పని చేయడం!

మంచు విష్ణు..

“శరత్ బాబు గారు గొప్ప నటుడు. తెలుగు, తమిళ్, మలయాళీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆయన అందరూ గర్వించే నటుడు. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. శరత్ బాబు ఫ్యామిలీకి ఇప్పుడు ప్రైవసీ అవసరం. కాబట్టి అందరూ సహకరించాలి” అంటూ కోరాడు.

జయసుధ..

“శరత్ బాబుతో కలసి ఎన్నో సినిమాలు నటించాను. తాజాగా మళ్ళీ పెళ్ళి సినిమాలో మేము ఇద్దరం కలసి నటించాం. బహుశా అదే ఆయన చివరి చిత్రం అనుకుంటున్నా. ఆయన ఆరోగ్య అప్పుడే వీక్ గా ఉన్నట్లు అనిపించింది. ఆయన హాస్పిటల్ లో ఉండగా పది రోజుల క్రితం వెళ్లి పరామర్శించాను. కోలుకొని తిరిగి వస్తారని అనుకున్నాను. ఆయన ఎంతో సున్నితంగా ఉండే వ్యక్తి. ఎప్పుడు చిరు నవ్వుతో ఉండే వారు. ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడని వ్యక్తి శరత్ బాబు గారు. ఆయన ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండే వారు. అలాంటి వ్యక్తికి ఇలా అవ్వడం చాలా బాధగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు కన్నడ పరిశ్రమలో కూడా చాలా చిత్రాలు చేశారు. ఆయన నాకు మంచి అన్నయ్య” అంటూ వ్యాఖ్యానించారు.

Sarath Babu : శరత్ బాబు, రమాప్రభల కథ ఏంటి.. పెళ్లి అయిందా? సహజీవనమా?

కమల్ హాసన్..

“ఒక గొప్ప నటుడు మరియు గొప్ప స్నేహితుడు శరత్ బాబుని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయనతో కలిసి నటించిన రోజులు ఇంకా నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. శరత్ బాబుని తమిళంలో నా గురువు పరిచయం చేశారు. ఎన్నో గుర్తిండిపోయే పాత్రల్లో ఆయన నటించి అలరించారు. సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోలుపోయింది” అంటూ ట్వీట్ చేశాడు.

రజినీకాంత్..

ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్ ని కోల్పాయాను. శరత్ బాబు ఒక గొప్ప వ్యక్తి. అతని మరణం తీరని లోటు. అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా.