సుమంత్ ‘కపటధారి’ మోషన్ పోస్టర్

సుమంత్, నందితా శ్వేత జంటగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘కపటధారి’ మోషన్ పోస్టర్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..

  • Published By: sekhar ,Published On : November 19, 2019 / 04:06 AM IST
సుమంత్ ‘కపటధారి’ మోషన్ పోస్టర్

సుమంత్, నందితా శ్వేత జంటగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘కపటధారి’ మోషన్ పోస్టర్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..

సుమంత్ హీరోగా క‌న్న‌డ మూవీ ‘కావ‌లూధారి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కన్నడలో ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. క‌న్న‌డలో చాలా పెద్ద హిట్ అయ్యింది.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో.. క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.జి.ధ‌నంజ‌య‌న్  రీమేక్ చేయ‌బోతున్నారు. ‘బేతాళుడు’ ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. సుమంత్‌, నందిత‌ జంటగా నటిస్తుండగా.. పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, వెన్నెల కిశోర్ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.

Read Also : చిన్నప్పటినుంచీ ఇంతే.. కళ్లతోనే మాట్లాడతావ్ – ‘రాజావారు రాణిగారు’ ట్రైలర్

 తెలుగులో ‘కపటధారి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమంత్ మేనమామ కింగ్ అక్కినేని నాగార్జున ‘కపటధారి’ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రధాన పాత్రలతో రూపొందించిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 2020 మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..