Karthi Sardar Movie Runtime: కార్తి ‘సర్దార్’ రన్‌టైమ్ అంతా..?

తమిళ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ సినిమా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్లు సర్దార్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Karthi Sardar Movie Runtime: కార్తి ‘సర్దార్’ రన్‌టైమ్ అంతా..?

Karthi Sardar Movie To Have Lengthy Runtime

Karthi Sardar Movie Runtime: తమిళ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ సినిమా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ సర్దార్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Karthi Sardar Teaser: సర్దార్ టీజర్.. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కేక పెట్టిస్తున్న కార్తి!

కాగా, ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ విషయంలో చిత్ర వర్గాల్లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. సర్దార్ చిత్రానికి లెంగ్తీ రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sardar: కార్తి సర్దార్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

ఈ సినిమాకు ఏకంగా 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఒక డబ్బింగ్ సినిమాకు ఇది చాలా ఎక్కువని.. అయితే సినిమాలో కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే మాత్రం ఈ రన్‌టైమ్ సినిమా విజయానికి ఎలాంటి అడ్డంకి కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తి విభిన్న గెటప్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకోనుండగా, రజీషా విజయన్, చంకీ పాండే, లైలా, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.