Karthikeya 2 6 Days Collections: కార్తికేయ-2 6 రోజుల కలెక్షన్స్.. వసూళ్ల వర్షంతో దుమ్ములేపుతోందిగా!

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటడంలో సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే బింబిసార, సీతా రామం చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాగా, గతవారం రిలీజ్ అయిన కార్తికేయ-2 మూవీ కూడా విజయఢంకా మోగిస్తోంది. ఈ సినిమా 6 రోజుల థియేట్రికల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.42 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసింది.

Karthikeya 2 6 Days Collections: కార్తికేయ-2 6 రోజుల కలెక్షన్స్.. వసూళ్ల వర్షంతో దుమ్ములేపుతోందిగా!

Karthikeya 2 6 Days Collections

Karthikeya 2 6 Days Collections: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటడంలో సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే బింబిసార, సీతా రామం చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాగా, గతవారం రిలీజ్ అయిన కార్తికేయ-2 మూవీ కూడా విజయఢంకా మోగిస్తోంది. ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్యన రిలీజ్ అయిన కార్తికేయ-2 మూవీ రిలీజ్ రోజునే అదిరిపోయే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Karthikeya 2 Creating Sensation In North Belt: బాలీవుడ్‌ను గడగడలాడిస్తున్న కార్తికేయ 2

ఇక ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉండటంతో, ప్రేక్షకులు ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అటు నార్త్ బెల్ట్‌లోనూ కార్తికేయ-2 మూవీ దుమ్ములేపుతోంది. రోజురోజుకూ థియేటర్ల సంఖ్యను ఎవరూ ఊహించని విధంగా పెంచుకుంటూ వెళ్తోంది. కాగా, ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు వచ్చినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Karthikeya 2 Locks OTT Partner: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కార్తికేయ-2

ఈ సినిమా 6 రోజుల థియేట్రికల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.42 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసింది. ఇదే జోరులో కార్తికేయ-2 దూసుకుపోతే, త్వరలోనే రూ.50 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటించగా, కాళభైరవ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇక కార్తికేయ-2 మూవీ 6 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 6.26 కోట్లు
సీడెడ్ – 2.59 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.25 కోట్లు
ఈస్ట్ – 1.38 కోట్లు
వెస్ట్ – 0.94 కోట్లు
గుంటూరు – 1.51 కోట్లు
కృష్ణా – 1.20 కోట్లు
నెల్లూరు – 0.53 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.16.66 కోట్లు (రూ.26.20 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.35 కోట్లు
ఓవర్సీస్ – 2.90 కోట్లు
నార్త్ ఇండియా – 2.75 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.23.66 కోట్లు (రూ.42 కోట్ల గ్రాస్)