Karthikeya 2 Collections: కార్తికేయ-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆ మార్క్‌ను టచ్ చేసిన నిఖిల్!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా, గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. పూర్తిగా మిస్టరీ థ్రిల్లర్ మూవీగా కార్తికేయ-2 మూవీ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Karthikeya 2 Collections: కార్తికేయ-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆ మార్క్‌ను టచ్ చేసిన నిఖిల్!

Karthikeya 2 First Week Collections

Karthikeya 2 Collections: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా, గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. పూర్తిగా మిస్టరీ థ్రిల్లర్ మూవీగా కార్తికేయ-2 మూవీ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Karthikeya 2 team : తిరుమల తిరుపతిలో సందడి చేసిన కార్తికేయ 2 టీం

ఇక కేవలం సౌత్‌లోనే కాకుండా ఈ సినిమా నార్త్ ఆడియెన్స్‌ను కూడా అమితంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమా అక్కడ కూడా భారీగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి వారం ముగిసేసరికి వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసింది. ఈ సినిమాకు కృష్ణాష్టమి కూడా కలిసిరావడంతో వసూళ్ల సంఖ్య భారీగా పెరిగిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Karthikeya 2 Creating Sensation In North Belt: బాలీవుడ్‌ను గడగడలాడిస్తున్న కార్తికేయ 2

నిఖిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా కార్తికేయ-2 అవతరిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా తొలి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 7.02 కోట్లు
సీడెడ్ – 2.91 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.59 కోట్లు
ఈస్ట్ – 1.54 కోట్లు
వెస్ట్ – 1.03 కోట్లు
గుంటూరు – 1.65 కోట్లు
కృష్ణా – 1.36 కోట్లు
నెల్లూరు – 0.59 కోట్లు
ఏపీ+తెలంగాణ – 18.69 కోట్లు (రూ.29.55 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.64 కోట్లు
ఓవర్సీస్ – 3.25 కోట్లు
నార్త్ ఇండియా – 4.45 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.28.03 కోట్లు ( రూ.50.55 కోట్ల గ్రాస్)