KGF2 : ‘కేజీఎఫ్ 2’ రీషూట్?? ఇప్పటిదాకా తీసిన సినిమా ఏమైంది??

కరోనా వల్ల 'కెజిఫ్ 2' వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 'కెజిఫ్ 2' షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అని చిత్ర బృందం తెలిపారు. ఇప్పటికే వాయిదా పడుతూ

KGF2 : ‘కేజీఎఫ్ 2’ రీషూట్?? ఇప్పటిదాకా తీసిన సినిమా ఏమైంది??

Kgf

KGF2 : కన్నడ సినీ పరిశ్రమ నుంచి గతంలో ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు. కానీ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడ పరిశ్రమని కాదు యావత్ దేశాన్ని ఊపేసింది. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని రెండు పార్టులుగా తీశారు. ఇప్పటికే ‘కేజీఎఫ్ 1’ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కన్నడ పరిశ్రమకి కూడా బాగా ప్లస్ అయింది సినిమా. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 2’ కూడా షూటింగ్ కంప్లీట్ చేశారు. కరోనా వల్ల ‘కేజీఎఫ్ 2’ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అని చిత్ర బృందం తెలిపారు. ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు.

Republic : రిపబ్లిక్ సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం..

కానీ తాజాగా ఈ సినిమాలోని ఒక ఫైట్ ని మళ్ళీ రీషూట్ చేస్తున్నట్టు సమాచారం. అంతకు ముందు తీసిన ఫైట్ సీన్ ఇంకా బెటర్ గా తీసి ఉండాల్సింది అనే అభిప్రయం రావడంతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టరు. ఈ సినిమాలో ఫైట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బెటర్మెంట్ కోసం మళ్ళీ తీద్దామని అనుకున్నారు. ఈ సినిమా టెక్నీషియన్స్ కొంతమంది షూటింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకి వచ్చింది. ఒకపక్క ప్రభాస్ ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా రీషూట్ కి వెళ్లారని తెలుస్తుంది. ఇదే కనక నిజమైతే ఇప్పటికే చాలా రోజులుగా వాయిదా పడుతున్న కెజిఫ్ మళ్ళీ వాయిదా పడనుందా అనే సందేహం వస్తుంది. ఇప్పటికే కేజీఎఫ్ 2 నుంచి టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు.