Republic : రిపబ్లిక్ సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం..

వైసీపీ నాయకులు రిలీజ్ రోజున కొన్ని చోట్ల ఈ సినిమాని అడ్డుకున్నారు. థియేటర్ల బయట ధర్నాలు చేశారు. తాజాగా ఈ సినిమాకి మరో కష్టం ఎదురయ్యింది.

Republic :  రిపబ్లిక్ సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం..

Republic

Republic :  సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రిపబ్లిక్’. సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉండటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వచ్చి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ రిపబ్లిక్ మూవీకి హైప్ తీసుకొచ్చాయి. సినిమా టాక్ బాగున్నా సినిమాకి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో వైసీపీ నాయకులు రిలీజ్ రోజున కొన్ని చోట్ల ఈ సినిమాని అడ్డుకున్నారు. థియేటర్ల బయట ధర్నాలు చేశారు. తాజాగా ఈ సినిమాకి మరో కష్టం ఎదురయ్యింది.

‘రిపబ్లిక్‌’ సినిమాపై పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచేలా సినిమాను చిత్రీకరించిన దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిన్న ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వడ్డి కుల సంక్షేమ సంఘం నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరు ప్రజలు విషపూరిత రసాయనాలతో చేపల సాగు చేస్తున్నట్లుగా ‘రిపబ్లిక్’ సినిమాలో చూపించడం దారుణమన్నారు. దీనివల్ల చేపల సాగుపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

Raamayanam : ఆ రావణుడు ఇక లేడు..

రాష్ట్ర వడ్డి కుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సైదు గాయత్రి సంతోషి మాట్లాడుతూ.. ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఇలా అసత్యాలతో సినిమా తీయడం దారుణమని అన్నారు. చిత్ర ప్రదర్శన నిలిపివేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పల్లెం ప్రసాద్‌ హెచ్చరించారు. కైకలూరు, కొల్లేటి కోటలో కూడా ఆందోళన చేపట్టారు. రిపబ్లిక్‌ సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ థియేటర్‌ వద్ద, హైవేపై నిరసన తెలిపారు.