Khiladi : ఫిబ్రవరిలో ‘ఖిలాడీ’ ఆట షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్

తాజాగా 'ఖిలాడీ' రిలీజ్‌ డేట్‌ ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న 'ఖిలాడీ' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవితేజ

Khiladi : ఫిబ్రవరిలో ‘ఖిలాడీ’ ఆట షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Khiladi

Khiladi :  మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటీవల ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. ఇంకా కొత్త కథలు వింటున్నాడని సమాచారం. ‘క్రాక్’ రవితేజ 66వ సినిమాగా రిలీజ్ అయింది. తక్కువ టైంలో వరుసగా రవితేజ 71వ సినిమా వరకు అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

Akhil Sarthak : మీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలన్నది నా కోరిక.. తండ్రికి కార్ కొనిచ్చిన అఖిల్ సార్థక్

తాజాగా రవితేజ 67వ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా రాబోతుంది. ఇప్పటికే సంక్రాంతి వరకు స్టార్ హీరోలంతా లైన్లో ఉండగా మిగిలిన సినిమాలన్నీ ఫిబ్రవరిలో డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇదే వరుసలో రవితేజ కూడా ‘ఖిలాడీ’ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాడు.

Mahesh Babu : త్వరలో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల పాఠశాలకు వస్తాను : మహేష్ బాబు

తాజాగా ‘ఖిలాడీ’ రిలీజ్‌ డేట్‌ ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవితేజ ద్విపాత్రాభినయంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరిలు ‘ఖిలాడీ’లో హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ హోటల్.. పీక్స్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్

ఇప్పటికే ఫిబ్రవరిలో ‘ఆచార్య’, ‘మేజర్’, ‘ఎఫ్3’ సినిమాలు రాబోతున్నాయి. వాటి మధ్యలో ‘ఖిలాడి’ కూడా డేట్ ఫిక్స్ చేసుకుంది.