Kamal Hasan: విక్రమ్ కోసం కేజియఫ్ స్టంట్ మాస్టర్స్!

విశ్వనటుడు కమలహాసన్ సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయో విశ్వరూపం సినిమాలో మనం చూసే ఉన్నాం. కమల్ వయసుతో సంబంధం లేకుండా కుర్రహీరోలతో పోటీగా యాక్షన్ సన్నివేశాలను చేస్తున్న కమల్ ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం ఏకంగా భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట.

Kamal Hasan: విక్రమ్ కోసం కేజియఫ్ స్టంట్ మాస్టర్స్!

Kgf'

Kamal Vikram: విశ్వనటుడు కమలహాసన్ సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయో విశ్వరూపం సినిమాలో మనం చూసే ఉన్నాం. కమల్ వయసుతో సంబంధం లేకుండా కుర్రహీరోలతో పోటీగా యాక్షన్ సన్నివేశాలను చేస్తున్న కమల్ ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం ఏకంగా భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట. కమల్ హీరోగా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా విక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.

కాగా, ఇప్పటికే వచ్చిన టీజర్ తో విక్రమ్ భారీ అంచనాలు సెట్ చేసుకుంది. కాగా ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా కోసం కేజీయఫ్ స్టంట్ మాస్టర్స్ కాంబో అంబు, అరివి బ్రదర్స్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేయనున్నారని దర్శకుడు తెలిపాడు. ఈ వార్తతో విక్రమ్ లో యాక్షన్ సీక్వెన్స్ లు ఏ రేంజ్ లో ఉండనున్నాయి అని ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.

అంబు, అరివి బ్రదర్స్ ఇప్పటికే మన తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కే ఖిలాడీ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని కంపోజ్ చేయగా ఇప్పుడు మరికొన్ని సినిమాల కోసం సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. ఇక విక్రమ్ సినిమాను కమల్ స్వయంగా తానే నిర్మిస్తుండగా యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా కేజేఎఫ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఫైట్స్ కంపోజింగ్ తో ఇప్పుడు ఈ సినిమా మరో లెవెల్ కు వెళ్లడం ఖాయంగా ఖరారైంది.