KTR : కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతుంది.. మరి కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు??

KTR మాట్లాడుతూ .. నాకు సినిమాతో పాటు క్రియేటివ్ కంటెంట్ అంటే ఇష్టం. నేను రోజూ 11, 12 పేపర్లు చదువుతాను, అలాగే మంచి బుక్స్ కనపడినా చదువుతాను. అమెరికాలో.............

KTR : కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతుంది.. మరి కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు??

KTR Comments KCR pan India politics in a cinema book launch event

KTR :  రచయితగా పలు సినిమాలకి పనిచేసిన దశరథ్ అనంతరం నాగార్జున సంతోషం సినిమాతో డైరెక్టర్ గా మారి సంతోషం, సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్.. లాంటి పలు సినిమాలు తీశారు. డైరెక్టర్ దశరథ్ చివరగా 2016లో మంచు మనోజ్ తో శౌర్య అనే సినిమా తీశారు. ఆ తర్వాత నుంచి సినిమాలు ఏమి తీయకపోయినా పలు సినిమాలకి రచయితగా సహకారం అందిస్తున్నారు. తాజాగా సినిమా స్టోరీ రైటింగ్ కు సంబంధించి దర్శకుడు దశరథ్ ‘కథా రచన’ అనే పుస్తకాన్ని రాశారు.

దశరథ్ రాసిన కథా రచన పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ భాష సాంసృతిక శాఖ తరపున ప్రచురించింది. దీంతో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి KTR విచ్చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో KTR తో పాటు దర్శకులు వివి వినాయక్, నాగ అశ్విన్, హరీష్ శంకర్, కాశీ విశ్వనాథ్, వి ఎన్ ఆదిత్య.. మరి కొంతమంది ప్రముఖులు హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమంలో KTR మాట్లాడుతూ .. నాకు సినిమాతో పాటు క్రియేటివ్ కంటెంట్ అంటే ఇష్టం. నేను రోజూ 11, 12 పేపర్లు చదువుతాను, అలాగే మంచి బుక్స్ కనపడినా చదువుతాను. అమెరికాలో మాక్ డేమిన్ వాళ్ళు రాసిన స్క్రీన్ ప్లే బుక్ గతంలో చదివాను. అలాంటి పుస్తకాలు తెర వెనుక ఉన్న టెక్నీషియన్స్ కు ఎంతో ఉపయోగ పడతాయి. ఈ పుస్తకం రాసిన దశరథ్ కి నా అభినందనలు. ఒక వ్యూవర్ గా కొన్ని సినిమాలు చూసినప్పుడు అమేజింగ్ గా ఉంటాయి. ప్రేక్షకుడికి హత్తుకొని పోయేలా సినిమా తీయాలి. బెంగుళూర్ తో మనం అన్నింటిలో పోటీ పడుతున్నాం. మన సినీ పరిశ్రమని సౌత్ హబ్ గా తీర్చిదిద్దాలనేదే మా ప్రయత్నం.

Harish Shankar : రీట్వీట్లు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి భజన చేస్తున్నావా అని విమర్శిస్తున్నారు..

కేసీఆర్ గారు కరోనా టైంలో మాట్లాడేటప్పుడు అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ ఆయన మాట్లాడితే ప్రజలు వింటారు. ప్రజలకు అర్ధం అయ్యేలా డిటైల్ గా చెపుతారు. దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు. అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము అంటూ సినిమాని, రాజకీయాలని కలిపి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో KTR చేసిన ఈ పాన్ ఇండియా నాయకుడు అనే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై విపక్షాలు ఏమైనా స్పందిస్తాయేమో చూడాలి.