Liger: డిజిటల్, శాటిలైట్ రైట్స్.. లైగర్ పవర్ మామూలుగా లేదుగా..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్ర శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.

Liger: డిజిటల్, శాటిలైట్ రైట్స్.. లైగర్ పవర్ మామూలుగా లేదుగా..?

Liger Satellite Digital Rights Sold For Whopping Price

Liger: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పూరీ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీని క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Liger: ఇండియాను షేక్ చేస్తోన్న లైగర్..!

కాగా, ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ అవతారమెత్తడంతో ఆయన ఈ సినిమాలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా అని అభిమానులు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా రైట్స్ కోసం అప్పుడే పోటీ పడుతున్నారట.

Liger: ‘అక్డీ పక్డీ’ ఫుల్ సాంగ్ రిలీజ్.. రెచ్చిపోయిన లైగర్!

అయితే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి చిత్ర యూనిట్ అమ్మినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ సంస్థ లైగర్ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.55 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై బాలవుడ్‌లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి నిజంగానే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇంత భారీ రేటుకు అమ్ముడయ్యాయో లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.