Liger Trailer: నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి – మైక్ టైసన్

లైగర్ ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ అయింది. "లైగర్" టైటిల్‌కు తగ్గట్లుగా లయన్ అంత పవర్ ఫుల్‌గా.. చిరుతతో సమానమైన వేగంతో విసిరాడు పంచ్‌లు పూరీ జగన్నాథ్. "పులికి, సింహానికి క్రాస్ బ్రీడ్ పుట్టుంటాడు నా కొడుకు" అని చెప్తున్న డైలాగ్ తో మొదలైన ట్రైలర్..

Liger Trailer: నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి – మైక్ టైసన్

Liger

 

Liger Trailer: లైగర్ ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ అయింది. “లైగర్” టైటిల్‌కు తగ్గట్లుగా లయన్ అంత పవర్ ఫుల్‌గా.. చిరుతతో సమానమైన వేగంతో విసిరాడు పంచ్‌లు పూరీ జగన్నాథ్. “లయన్‌కి, టైగర్‌కి పుట్టుంటాడు క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అని సీనియర్ నటి రమ్యకృష్ణ చెప్తున్న డైలాగ్ తో మొదలైన ట్రైలర్.. ఒక్కో షాట్ మైండ్ లో ప్రింట్ అయిపోయింది. కచ్చితంగా విజయ్ దేవరకొండలో కెరీర్ లో ఇప్పటివరకూ చేయనన్ని ఫీట్ లు సినిమాలో చేసినట్లు కనిపిస్తుంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన పూరీ కసి ట్రైలర్‌లో ప్రివ్యూ చూపించాడు. ఇక రిలీజ్ అయితే అభిమానుల ఆనందం ఆకాశం అందుకోవడం ఖాయం. విజయ్ ఈ సినిమాలో కాస్త నెత్తితో మాట్లాడుతున్నట్లు కనిపించడం వెనుక ఏదో ఎంటర్‌టైన్మెంట్ దాచినట్లే కనిపిస్తుంది. బాలీవుడ్ భామ అనన్యా పాండేను దగదగా మెరిసిపోతుంటే పూరీ స్టైల్ రొమాన్స్‌ను విజయ్ పండించేశాడు.

చివర్లో పంచ్ డైలాగ్ విసిరిన మైక్ టైసన్..
రమ్యకృష్ణ విజయ్‌ను కాలితో తన్నే షాట్‌తో ట్రైలర్ మొత్తం ఫైట్ సీన్లే కనిపించినా.. చివర్లో మైక్ టైసన్ ముందు నిల్చొని విజయ్… ఐ.. ఐ.. ఐ యామ్ ఏ ఫైటర్ అని చెప్తాడు. దానికి కౌంటర్ గా మైక్ టైసన్.. అయితే నేనేంటి అనే డైలాగ్ తో ట్రైలర్ పంచ్ విసిరాడు పూరీ జగన్నాథ్.

Read Also: ‘అక్డీ పక్డీ’ ఫుల్ సాంగ్ రిలీజ్.. రెచ్చిపోయిన లైగర్!

లైగర్ ట్రైలర్ కే సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సుదర్శన్ థియేటర్స్ వద్ద 75 అడుగుల భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు. విజయ్ కటౌట్ కు పాలాభిషేకం, పూలాభిషేకం చేసేశారు.

పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

లైగర్ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్+ వ్యూస్ తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది.