MAA Elections 2021 : ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబే లెజెండ్ : ‘మా’ ఎన్నికల అధికారి

'మా' ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ పక్షపాతం చూపించాడని, ఈసీ మెంబర్ల బ్యాలెట్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాడంటూ, ఎన్నికల అధికారిలా కాకుండా మంచు ప్యానెల్ సభ్యుడిలా పని చేశాడంటూ ఆరోపణలు

MAA Elections 2021 : ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబే లెజెండ్ : ‘మా’ ఎన్నికల అధికారి

MAA Elections 2021 :  ఈ సారి ‘మా’ ఎన్నికలు జరిగిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సారి పోటీ కూడా అంత తీవ్రంగా ఉంది. ప్రచారం కూడా జనరల్ ఎలక్షన్స్ లెవెల్లో చేశారు. పోలింగ్ రోజు గొడవలు కూడా జరిగాయి అంటే ‘మా’ ఎన్నికల్లో ఎంత రసాభాస జరిగిందో అర్ధమవుతుంది. ఎలక్షన్ పోలింగ్ అయ్యాక రిజల్స్ లో తేడా జరిగిందని ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన అందరూ రాజీనామా చేశారు. మీడియా ముందుకి వచ్చి పోలింగ్ రోజున జరిగిన దారుణాలని వివరించారు. ఈ సందర్భంలో ‘మా’ ఎన్నికల అధికారిపై చాలా ఆరోపణలు చేశారు.

‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ పక్షపాతం చూపించాడని, ఈసీ మెంబర్ల బ్యాలెట్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాడంటూ, ఎన్నికల అధికారిలా కాకుండా మంచు ప్యానెల్ సభ్యుడిలా పని చేశాడంటూ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలని తర్వాత కృష్ణ మోహన్ కొట్టి పారేశారు. కానీ తాజాగా ఇవాళ మంచు విష్ణు ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడిన మాటలు వింటే అది నిజమే అనిపిస్తుంది.

Bigg Boss 5 : యాక్టర్స్ అంటే చిన్న చూపా?? గడ్డి తినమంటే తింటావా??.. కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్

ఇవాళ మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవంలో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తరువాత అంతటి లెజెంట్ ఒక్క మోహన్ బాబే అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. మా అసోసియేషన్‌ను పెట్టి 28 ఏళ్లు అవుతున్నాయి. పద్నాలుగు మంది ప్రెసిడెంట్లు వచ్చారు. అందులో పది మంది ప్రెసిడెంట్లు నా ఆధ్వర్యంలోనే ఎన్నికయ్యారు. అది నాకు ఎంతో గర్వంగా ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సారి మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని అన్నారు. ఎన్టీఆర్ తరువాత అంతటి లెజెండ్ మోహన్ బాబే అని ఆయన్ని పొగిడారు. ఇప్పటికే ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటూ వివాదం చెలరేగుతుంది. ఇక ఈ మాటలతో ఆ వివాదానికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఇవాళ ఆయన మాట్లాడిన స్పీచ్ ప్రకాష్ రాజ్ ప్యానల్ తో పాటు వేరే వాళ్ళకి కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.