Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాలు వరుసగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న గాడ్‌ఫాదర చిత్రం చివరిదశ షూటింగ్....

Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?

Madhavan As Villain For Chiranjeevi Mega154 Movie

Mega154: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాలు వరుసగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న గాడ్‌ఫాదర చిత్రం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ చిత్రాలను మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ కూడా మొదలైంది.

Mega154: మెగా154లో ఉప్పెన సృష్టించబోతున్న విలన్..?

అయితే దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న సినిమాకు మెగా154 అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాబీ రెడీ అవుతున్నాడు. కాగా.. ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అందుకే ఈ సినిమాలో విలన్ కొత్తగా ఉంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ క్రమంలో పలువురు పేర్లను పరిశీలించిన దర్శకుడు బాబీ, చివరకు ఈ సినిమాలో నటుడు ఆర్.మాధవన్‌ను సెలెక్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?

ఒకప్పుడు హీరోగా తమిళ, హిందీ భాషల్లో తనకంటూ అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న ఈ యాక్టర్, ప్రస్తుతం తన ఏజ్‌కు తగ్గట్టుగా క్యారెక్టర్, విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే అక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో మాధవన్ సక్సెస్ అయ్యాడు. దీంతో ఇప్పుడు చిరును ఢీకొనే పాత్రలో మాధవన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటాడని దర్శకుడు బాబీ అనుకుంటున్నాడట. ఈ మేరకు మాధవన్‌ను విలన్ పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి నిజంగానే ఈ సినిమాలో మాధవన్ విలన్ పాత్రలో నటిస్తాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.