SSMB28 : తమన్ పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన తమన్!

టాలీవుడ్ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో సౌత్ లో ప్రతి స్టార్ హీరో సినిమాకి తమన్ సంగీతం కొట్టాల్సిందే. అయితే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నాక ఎంతో కొంత నెగటివిటీ కూడా పేస్ చేయాల్సి వస్తుంది కదా. తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమన్ పై నెగటివిటీ స్ప్రెడ్ చేస్తుండగా...

SSMB28 : తమన్ పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన తమన్!

ssmb28

SSMB28 : టాలీవుడ్ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో సౌత్ లో ప్రతి స్టార్ హీరో సినిమాకి తమన్ సంగీతం కొట్టాల్సిందే. తమన్ మ్యూజిక్ ఉంటే చాలు సినిమాకి అదే సగం బలం అని నమ్ముతున్నారు మేకర్స్, అభిమానులు. అందుకు నిదర్శనం అఖండ, వీరసింహారెడ్డి, వకీల్ సాబ్, వరిసు సినిమాలు. అయితే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నాక ఎంతో కొంత నెగటివిటీ కూడా పేస్ చేయాల్సి వస్తుంది కదా. ట్యూన్స్ కాపీ కొడుతున్నాడు అంటూ తమన్ పై సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తుంటారు.

SSMB28 : సంక్రాంతే కాదు.. దసరాకి కూడా పోటీయే!

తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమన్ పై నెగటివిటీ స్ప్రెడ్ చేస్తుండగా, తమన్ వాటికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం తమన్ SSMB28 చిత్రానికి పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తమన్ ని తప్పించాలి అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. దీని పై తమన్ స్పందిస్తూ తను గిటార్ ప్లే చేస్తున్న ఒక ఫోటో అప్లోడ్ చేస్తూ.. నా పై నెగటివిటీ స్ప్రెడ్ చేసే అందరి ఆత్మకు శాంతి కలగాలి అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

కాగా తమన్ ని సపోర్ట్ చేస్తూ తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ‘వరిసుకి ఎంతమంచి ఆల్బమ్ ఇచ్చాడు. సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి బ్రదర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ ఇప్పుడు ఎందుకు మొదలయింది అంటే.. SSMB28 కోసం తమన్ ఇచ్చిన ఫస్ట్ ట్యూన్ ని మహేష్ అండ్ త్రివిక్రమ్ రిజెక్ట్ చేశారు అంటూ ఒక న్యూస్ వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు ఈ ట్రోలింగ్ కి దిగారు. త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.