నాలుగు వారాల కలెక్షన్స్

మజిలీ 28 రోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.30.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా అయితే రూ.38.52 కోట్ల షేర్, రూ.68.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది..

  • Published By: sekhar ,Published On : May 3, 2019 / 10:30 AM IST
నాలుగు వారాల కలెక్షన్స్

మజిలీ 28 రోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.30.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా అయితే రూ.38.52 కోట్ల షేర్, రూ.68.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన మజిలీ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యి, పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. చైతు నటనకి, దర్శకుడి టేకింగ్‌కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన మజిలీకి అన్ని క్లాసుల ప్రేక్షకులనుండి, అన్ని ఏరియాలనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. దివ్యాంశ కౌషిక్ మరో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్‌గా రన్ అవుతుందీ సినిమా.. రీసెంట్‌గా మజిలీ నాలుగు వారాల కలెక్షన్స్ వివరాలు బయటకొచ్చాయి. 28 రోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.30.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా అయితే రూ.38.52 కోట్ల షేర్, రూ.68.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏరియాల వారీగా మజిలీ లెక్కలు ఇలా ఉన్నాయి.

నైజాం : రూ.13.02 కోట్లు
సీడెడ్ : రూ.4.48 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.4.52 కోట్లు
కృష్ణ : రూ.1.85 కోట్లు
గుంటూరు : రూ.2.08 కోట్లు
ఈస్ట్ : రూ.1.82 కోట్లు
వెస్ట్ : రూ.1.38 కోట్లు

నెల్లూరు : రూ.0.92 కోట్లు 
ఏపీ & తెలంగాణా : రూ.30.07 కోట్లు
కర్ణాటక & రెస్టాఫ్ ఇండియా : రూ.4.40 కోట్లు
 ఓవర్సీస్ : 4.05 కోట్లు
వరల్డ్ వైడ్ : రూ. 38.52 కోట్లు (షేర్), రూ.68.05 కోట్లు (గ్రాస్)..

పాతిక కోట్ల షేర్ దాటగానే చైతు కెరీర్‌లో మజిలీ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా అని ట్రేడ్ వర్గాలు కన్ఫమ్ చేసాయి. మహర్షి రావడానికి మరికొద్ది రోజులు టైముంది కాబట్టి,  ఫుల్ రన్‌లో మజిలీ రూ.40 కోట్ల మార్క్‌ను అందుకుంటుందేమో చూడాలి.