Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..

మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ముందుగానే సినిమాను ప్రదర్శించడానికి మేజర్ చిత్ర యూనిట్ బుక్‌మైషోతో జతకట్టింది. జూన్ 3న అధికారికంగా విడుదలకాబోయే ముందే 'మేజర్'...................

Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..

Major

Major :  సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయితే కొన్ని గంటల ముందో లేక ఒక రోజు ముందో స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు వేస్తారు. కానీ తాజాగా అడవి శేష్ నటించిన మేజర్ సినిమా ఏకంగా 10 రోజుల ముందే స్పెషల్ షోలు వేయనుంది. ఒక సినిమా రిలీజ్ కి 10 రోజుల ముందే థియేటర్లలో స్పెషల్ షో వేసి సరికొత్త రికార్డ్ సృస్టించనుంచి మేజర్ సినిమా. అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బయోపిక్ తెరకెక్కుతుంది. శశికిరణ్ దర్శకత్వంలో ఈ సినిమాని మహేష్ బాబు నిర్మించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ప్రతి భారతీయుడు చూడవలసిన కథ.

మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ముందుగానే సినిమాను ప్రదర్శించడానికి మేజర్ చిత్ర యూనిట్ బుక్‌మైషోతో జతకట్టింది. జూన్ 3న అధికారికంగా విడుదలకాబోయే ముందే ‘మేజర్’ దేశంలోని పలు నగరాల్లో రోజుకి ఒక చోట ప్రత్యేక ప్రివ్యూ షోలు వేయనున్నారు. బుక్‌మైషో యాప్ లో ఏ రోజు ఏ సిటీలో ఏ థియేటర్లో ప్రదర్శిస్తున్నారో చూసి టికెట్ బుక్ చేసుకొని ఈ సినిమాని రిలీజ్ కంటే ముందే చూసేయొచ్చు. జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళంలో మేజర్ సినిమా విడుదల కానుంది.

Khushi : అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన సమంత, విజయ్.. గ్రూప్ ఫొటోలతో హడావిడి..

 

పూణే, ముంబై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో నగరాల్లో మేజర్ సినిమాని ఈ నెల మే 24 నుంచి రోజుకి ఒకచోట ప్రదర్శించనున్నారు. అన్ని నగరాల్లో అయ్యాక జూన్ 3న దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మేజర్ సినిమా రిలీజ్ కంటే ముందే ఈ స్పెషల్ షో లో చూసేయాలి అంటే బుక్ మై షో యాప్ లో టికెట్లు బుక్ చేసుకోవాలి.