Adivisesh : మహారాష్ట్ర సీఎంని కలిసిన మేజర్ టీం..

తాజాగా మేజర్ సినిమా టీం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. ఆయన నివాసంలో మేజర్ టీంని ఉద్ధవ్ ఠాక్రే అభినందించారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరోయిన్ సయీ మంజ్రేకర్‌, మరికొంతమంది చిత్ర సభ్యులు.............

Adivisesh : మహారాష్ట్ర సీఎంని కలిసిన మేజర్ టీం..

Major :  26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా majar సినిమా తెరకెక్కించారు. అడవి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా, శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని భారీ విజయం సాధించింది. సినిమా కలెక్షన్లు కూడా అదరగొడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు, పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేజర్ సినిమా టీం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. ఆయన నివాసంలో మేజర్ టీంని ఉద్ధవ్ ఠాక్రే అభినందించారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరోయిన్ సయీ మంజ్రేకర్‌, మరికొంతమంది చిత్ర సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేసి స్పెషల్ ట్వీట్ చేశారు అడివి శేష్.

Aadi : టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఆది సాయికుమార్..

ఈ ట్వీట్ లో.. ”ఇవాళ మేజర్ చిత్ర యూనిట్ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని కలవడం చాలా ఆనందంగా ఉంది. మేజర్ సినిమా తరపున మొదలుపెట్టే ఎన్డీయే కార్యక్రమానికి ఆయన పూర్తిగా సహకరిస్తామని, నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలో సీఎం, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేయనున్నాం” అని తెలిపారు.