‘ఓనమ్‌ అగోషం’.. మెరుస్తూ మురిసిపోయిన మల్లూ భామలు..

  • Edited By: sekhar , September 8, 2022 / 06:34 PM IST
‘ఓనమ్‌ అగోషం’.. మెరుస్తూ మురిసిపోయిన మల్లూ భామలు..

Mallu Celebrities Onam Celebrations: కేరళ ప్రజలకు ఓనం ప్రత్యేక పండుగ. ఆగస్ట్‌ చివర్లో మొదలై సెప్టెంబర్‌ మొదటివారంలో ముగిసే ఈ పండుగను కేరళవాసులు పదిరోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగురంగుల పూల ముగ్గులు వేసి మధ్యలో దీపం వెలిగిస్తారు. దీనిని ‘పూకోలం’ అంటారు. ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ‘ఓనసద్యా’ అనే విందు చాలా ముఖ్యమైనది. సోమవారం మల్లూ భామలు ఓనం పండుగను వైభవంగా జరుపుకొన్నారు.Keerthy Suresh ‘ఓనమ్‌ అగోషం’(సెలబ్రేషన్స్‌) అంటూ నెట్టింట్లో ఫొటోలతో సందడి చేశారు. కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌, కల్యాణి ప్రియదర్శిన్‌, మంజిమా మోహన్‌, మాళవిక మోహనన్‌, పూర్ణ తదితరులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు.

https://www.instagram.com/p/CEeSad-Mqnu/?utm_source=ig_web_copy_link

ఈ సందర్భంగా ‘కొవిడ్‌ 19 విపత్కర పరిస్థితుల్లో ప్రాణాల్ని లెక్కచేయకుండా కరోనా సోకిన వారికి సేవలు అందిస్తున్న నర్సులకు కథానాయిక కల్యాణీ ప్రియదర్శన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ ఏడాది నా ఓనం పూకోలం(పూల ముగ్గు)ను నర్సులకు డెడికేట్‌ చేస్తున్నా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారామె! నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్‌తోపాటు కుటుంబ సభ్యులతో కలిసి ఓనం పండుగ జరుపుకొన్నారు.Nayanthara