Manchu VIshnu: నేను రాడికల్.. నా నిర్ణయాలు అలాగే ఉంటాయి -మంచు విష్ణు

కొత్తగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Manchu VIshnu: నేను రాడికల్.. నా నిర్ణయాలు అలాగే ఉంటాయి -మంచు విష్ణు

Manchu Vishnu

Manchu VIshnu: కొత్తగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై చర్చించారు. ఈ సమావేశంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాపై చర్చించినట్లు చెప్పారు.

త్వరలోనే రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తన నిర్ణయాలు విప్లవాత్మకంగా ఉంటాయని అన్నారు విష్ణు. తాను రాడికల్‌ను అని, రాడికల్ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు విష్ణు. మేనిఫెస్టోలో ఇచ్చిన 14 హామీల అమలే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

మా సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం పలు కార్పోరేట్ హాస్పిటల్స్‌తో ఒప్పందం చేసుకోనున్నట్లు చెప్పారు మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయగా.. రాజీనామాలను ఈసీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. రాజీనామాలు విరమించుకుని పదవుల్లో కొనసాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాసినట్లు సమాచారం.