Masaba Gupta : తల్లి నీనా గుప్తా, సతీష్ కౌశిక్ బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మసాబా ఎమోషనల్ పోస్ట్..

నీనా కుటుంబంతో సతీష్ కి మంచి స్నేహం ఉండటంతో మసాబా కూడా చిన్నప్పటి నుంచి సతీష్ కి క్లోజ్ అయింది. సతీష్ మరణంతో మసాబా కూడా బాధపడుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తల్లి నీనా గుప్తా, సతీష్ కలిసి వర్క్ చేసిన..............

Masaba Gupta : తల్లి నీనా గుప్తా, సతీష్ కౌశిక్ బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మసాబా ఎమోషనల్ పోస్ట్..

Masaba Gupta emotional post on Satish Kaushik and remember neena gupta satish friendship

Masaba Gupta :  ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మార్చ్ 9 గురువారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. 67 ఏళ్ళ ఈ నటుడు గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. సతీష్ కౌశిక్ దాదాపు 100 కి పైగా హిందీ సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. 20 సినిమాలను దర్శకుడిగా తెరకెక్కించారు. సతీష్ కౌశిక్ హఠాన్మరణంతో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ప్రముఖ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సతీష్ కి 45 ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో మా 45 ఏళ్ళ స్నేహం అర్దాంతరంగా ముగిసిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణబీర్ కపూర్, కంగనా రనౌత్, అభిషేక్ బచ్చన్, మధుర్ భండార్కర్.. ఇలా చాలా మంది స్టార్ సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు.

అయితే సతీష్ కౌశిక్, అనుపమ్ ఖేర్, బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా దాదాపు 40 ఏళ్లుగా మంచి స్నేహితులు. నీనా గుప్తా సతీష్ మరణంతో కుంగిపోయింది. సతీష్ ని గుర్తు చేసుకుంటూ తన కెరీర్ తొలినాళ్లలో తనకు ఎంతగా సపోర్ట్ చేశాడో అంటూ ఎమోషనల్ అయింది నీనా. నీనా కష్టాల్లో ఉన్నప్పుడు తన పక్కనే ఉండి సపోర్ట్ చేసాడు సతీష్. నీనా పెళ్లి కాకుండానే గర్భవతి అయితే సతీష్ పెళ్లి చేసుకోడానికి కూడా ముందుకొచ్చాడు. అంతలా ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు. 40 ఏళ్లుగా వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. నీనా గుప్తా కూతురు మసాబా గుప్తాకి కూడా ఇండస్ట్రీలో సపోర్ట్ గా నిలిచాడు సతీష్. మసాబా గుప్తా ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంది.

Satish Kaushik : సతీష్ కౌశిక్ అంత్యక్రియలు.. తరలివచ్చిన బాలీవుడ్.. అన్ని దగ్గరుండి చూసుకున్న అనుపమ్ ఖేర్..

నీనా కుటుంబంతో సతీష్ కి మంచి స్నేహం ఉండటంతో మసాబా కూడా చిన్నప్పటి నుంచి సతీష్ కి క్లోజ్ అయింది. సతీష్ మరణంతో మసాబా కూడా బాధపడుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తల్లి నీనా గుప్తా, సతీష్ కలిసి వర్క్ చేసిన ఓ పాత సినిమా స్టిల్ ని షేర్ చేస్తూ.. మా అమ్మకి ఉన్న బెస్ట్ గిఫ్ట్ మీరే. మా అమ్మకు మీరెంతగానో సపోర్ట్ చేశారు సతీష్ అంకుల్. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము అని పోస్ట్ చేసింది. అలాగే నీనా, సతీష్, అనుపమ్ ఖేర్ పాత ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వాళ్ళ మధ్య ఉన్న స్నేహాన్ని తెలిపింది. సతీష్ మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకోగా అనుపమ్ ఖేర్, నీనా గుప్తా మాత్రం సతీష్ ని తలుచుకుంటూ తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.