‘డిస్కో రాజా’ చూసి ఎంజాయ్ చేస్తారు – మాస్ మహారాజ్ రవితేజ

‘డిస్కో రాజా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజ్ రవితేజ..

  • Published By: sekhar ,Published On : January 20, 2020 / 09:55 AM IST
‘డిస్కో రాజా’ చూసి ఎంజాయ్ చేస్తారు – మాస్ మహారాజ్ రవితేజ

‘డిస్కో రాజా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజ్ రవితేజ..

మాస్ మహారాజ్ రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ నటుడు బాబీ సింహా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ : ‘‘చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన పాత్రలను ఆనంద్‌ నాకు చెప్పారు. అందుకే వెంటనే సినిమాకు ఓకే చెప్పాను. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ చేశా. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నేను ఎంతగా ఎంజాయ్‌ చేశానో.. చూస్తున్నప్పుడు మీరు అంతకంటే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సీక్వెల్‌ కూడా ఉంటుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌తో ఇది నాకు పదకొండో సినిమా. పాటలు ఎంత హిట్టయ్యాయో మీకు తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని సినిమాకు నిజమైన ఆస్తి. చాలా బాగా పని చేశాడు. ఈ సినిమాలో సైఫై సెట్‌ అద్భుతం. ఆ సెట్‌ను అందరూ బాగా వినియోగించుకున్నారు.

Read Also : ‘సైరా’ రికార్డును బీట్ చేసిన ‘అల వైకుంఠపురములో’..

Image

ప్రొడ్యూసర్‌ రామ్‌ తాళ్లూరితో ఇది రెండో సినిమా. మొదటి సినిమా అనుకున్న ఫలితం తేలేకపోయినా ఈ సినిమా మాత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. రచయిత అబ్బూరి రవి నా సినిమాలకు నన్ను దృష్టిలో పెట్టుకొని కథ రాస్తారు. ఇక పాటల విషయంలో శాస్త్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ద్వారా బాబీ సింహా, రాంకీలతో తొలిసారి కలిసి పనిచేశాను. ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. సునీల్‌తో చాలా గ్యాప్ తరవాత కలిసి పనిచేశాను.

Image

ఈ సినిమాలో నటించిన అందరితో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సాధారణంగా నేను ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లతో నటించాను కానీ.. తొలిసారి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో నటించాను. పాయల్ రాజ్‌పుత్‌ది ప్రత్యేక పాత్ర.. నభా నటేష్ గురించి చెప్పాల్సిన అవసరంలేదు ఇరగదీసింది. ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర వర్క్ చాలా బాగుంది.. రెట్రో, సైఫై సెట్‌లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి’’ అన్నారు.