Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!

మాస్ మహారాజా మాంచి స్పీడ్ మీదున్నారు. సీనియర్ హీరోల్లో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు లైనప్ చేసుకున్నారు రవితేజ. హిట్, ఫ్లాప్ ని అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న రవితేజ..

Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!

Raviteja: మాస్ మహారాజా మాంచి స్పీడ్ మీదున్నారు. సీనియర్ హీరోల్లో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు లైనప్ చేసుకున్నారు రవితేజ. హిట్, ఫ్లాప్ ని అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న రవితేజ సినిమాల్ని ఎంత ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారో అంతే ఫాస్ట్ గా నెల తిరక్కుండానే రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ ప్లాన్ చేశారు. గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని లైన్లో పెట్టిన రవితేజ ఇప్పుడు ఆ సినిమాల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు.

Janhvi Kapoor: డ్రెస్ ఏదైనా దాగనంటున్న జాహ్నవి ఉప్పొంగే అందాలు!

ఆల్రెడీ ఖిలాడి రిలీజ్ తో బిజీగా ఉన్న రవితేజ.. రామారావ్ ఆన్ డ్యూటీని కూడా రిలీజ్ కు రెడీ చేసేశారు. నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరి, మార్చిలో ఈ రెండు సినిమాల బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ తో ఫ్యాన్స్ కి డబుల్ ఫీస్ట్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా రవితేజ తన 68వ సినిమా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి 25న ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. రవితేజ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఈ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాని కొత్త డైరెక్టర్ శరత్ మండవ డెబ్యూ డైరెక్ట్ చేస్తున్నారు. మాస్ మోత మోగించే ఈ ఎనర్జిటిక్ స్టార్.. ఈ సినిమాలో తగ్గేదే లే అన్నట్టు గవర్నమెంట్ సర్వెంట్ గా ఫుల్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

Pushpa: గెట్ రెడీ.. మరో సాంగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఫిక్స్!

రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ్యడంతో రవితేజ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని రిలీజ్ కు రెడీ చేసినట్టైంది. రామారావ్ ఆన్ డ్యూటీ కంటే ముందే ఫిబ్రవరి 11న ఖిలాడి రిలీజ్ కు రెడీ అయ్యింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఖిలాడీ సినిమాలో రెండు క్యారెక్టర్స్ తో ఎంటర్ టైన్ చెయ్యబోతున్న రవితేజ.. ఫిబ్రవరిలో ఖిలాడిగా నెగెటివ్ రోల్ లో కనిపిస్తూ.. మార్చిలో పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ రామారావ్ గా ఆడియన్స్ కి డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారు.